హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ విధానాలకు ఆకర్షితులై, మహారాష్ట్రలో వంజరి కులస్థులు బీఆర్ఎస్కు మద్దతు తెలుపుతున్నారని అఖిల భారత, తెలంగాణ వంజరి సంఘాల నేతలు పేర్కొన్నారు. సోమవారం హైదరాబాద్‌లో అఖిల భారత వంజరి సేవా సంఘం సీనియర్ జాతీయ ఉపాధ్యక్షుడు సాల్వేర్ కృష్ణ, తెలంగాణ రాష్ట్ర వంజరి సంఘం మాజీ అధ్యక్షుడు కాలేరు విశ్వనాథం, తెలంగాణ వంజరి సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎదుగని శంకర్ నారాయణ తదితరులు మీడియాతో మాట్లాడారు.
స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే తమకు గుర్తింపు లభించిందని పేర్కొన్నారు. వంజరి కులస్థుడికి ఎమ్మెల్యే టికెట్, ఉప్పల్ భగాయత్‌లో సంఘ భవనానికి స్థలం, నిధులు కేటాయించిన సీఎం కేసీఆర్‌కు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వంజరి సేవా సంఘం ప్రధాన కార్యదర్శి దాత్రిక ధర్మరాజు, సురేశ్ కాలేరు తదితరులు పాల్గొన్నారు.