హైదరాబాద్, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ వ్యాప్తంగా గ్రా మీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ సర్కారుకు ఎదురుగాలి వీస్తున్నది. ఆ పార్టీపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ముఖ్యంగా రైతులు, యువత, మహిళల నుంచి వ్యతిరేకత ఉన్నదని తేలింది. ఇప్పటికిప్పుడు స్థానిక ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ ఘోరం గా దెబ్బతింటున్నదని తేలింది. స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలనే ఉద్దేశంతో ఇటీవల కాంగ్రెస్ నిర్వహించిన సర్వేలో ఆ పార్టీ నేతలకు కండ్లు బైర్లు కమ్మే చేదు నిజం వెల్లడైంది. గ్రామీణ ఓటర్లలో60% మంది కాంగ్రెస్ ప్రభుత్వంపై అసంతృప్తిని వ్యక్తంచేసినట్టు తెలిసింది. యూరి యా కొరత, ఇందిరమ్మ ఇండ్ల వ్యవహా రం, చిరుద్యోగుల వేతనాల పెండింగ్, అభివృద్ధి లోపాలు, ఆరు గ్యారెంటీలు, 420 హామీల ఉల్లంఘన వంటి కారణాలతో పల్లె ప్రజల నుంచి ఈ వ్యతిరేకత వస్తున్నది. ఈ అంశం రాష్ట్ర రాజకీయా ల్లో కీలక మలుపు తీసుకుంటుందని కాం గ్రెస్ నేతలు భయపడినట్టు సమాచారం. క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపిన మంత్రు లు కూడా ఇప్పుడే స్థానిక పోరు వద్దని, వాయిదా వేయాలని రేవంత్‌కు సూచించినట్టు తెలిసింది. ఓటమి భయంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక ఎన్నికలను వాయిదా వేస్తూ వస్తున్నట్టు విశ్లేషకులు సైతం చెప్తున్నారు. పైకి మా త్రం బీసీలకు 42% రిజర్వేషన్‌పై కట్టుబడి ఉన్నట్టు చెప్పుకుంటూ, మరోవైపు ఎన్నికలు నిర్వహించకుండా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నదని ఆరోపిస్తున్నారు.
ప్రస్తుతం తెలంగాణలో 1.28 కోట్ల మంది ఓటర్లు, 12,760 గ్రామ పంచాయతీలు, 141 మున్సిపాలిటీలు, 7 మ హానగరాలు సహా విస్తృతంగా స్థానిక సం స్థలు ఉన్నాయి. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికే గ్రామ పంచాయతీల వార్డులవారీ ఓటర్ల తుది జాబితాను, పోలింగ్ స్టేషన్ల జాబితాను ఈ నెల రెండో తేదీనే విడుదల చేసింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు సంబంధించిన పోలింగ్స్టేష న్లు, ఓటర్ల తుది జాబితాలను కూడా వి డుదల చేసింది. విడతలవారీగా కాకుం డా ఒకేసారి నిర్వహించేందుకు వీలుగా కూడా మహారాష్ట్ర, గుజరాత్ నుంచి బ్యా లెట్ బాక్సులను తెప్పించింది. రాష్ట్రంలో మొత్తం 1,31,883 బ్యాలెట్ బాక్సులను సిద్ధంగా పెట్టింది. ఓ వైపు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నెల రోజుల్లో స్థానిక ఎన్నికల నిర్వహణను పూర్తిచేసేందుకు సర్వం సి ద్ధంచేసి ఉంచింది. కాంగ్రెస్ సర్కారు స్థానిక పోరుకు ఎప్పుడు గ్రీన్‌సిగ్నల్ ఇస్తే అప్పుడు ఎన్నికల ప్రక్రియను ముగించేందుకు సిద్ధంగా ఉన్నది. కానీ, రేవంత్ స ర్కార్ మాత్రం ఓటమి భయంతో స్థానిక ఎన్నికలను వాయిదా వేస్తున్నట్టు పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ అంశాన్ని ముందు పెట్టి తప్పించుకుంటున్నారని అంటున్నారు.