హైదరాబాద్, మార్చి 21 (నమస్తే తెలంగాణ): రానున్న రెండు రోజులపాటు రాష్ట్రంలో సాధారణ ఉష్ణోగ్రతలు నమోదుకానున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. తదుపరి ఉష్ణోగ్రతలు రెండు నుంచి నాలుగు డిగ్రీలు పెరిగే అవకాశమున్నదని తెలిపింది.
శనివారం నల్లగొండ జిల్లా నేరేడుగొమ్ములో అత్యధికంగా 38.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్టు పేర్కొంది. నిర్మల్ జిల్లా సోన్ మండలం పాక్పట్లలో 37.8 డిగ్రీలు, నాగర్కర్నూల్ జిల్లా తాండూరు మండలం యెంగంపల్లిలో 37.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్టు వాతావరణ శాఖ వెల్లడించింది.