High Court | ఇది ప్రజా ప్రయోజనమా లేక ప్రచార వ్యాజ్యమా.. కాళేశ్వరం పిల్ వెనుక ఎవరున్నరో తేలుస్తం: హైకోర్టు
కాళేశ్వరం ప్రాజెక్టుపై దాఖలైన ప్రజాహిత వ్యాజ్యం వెనుక ఎవరున్నారో తమకు తెలుసునని హైకోర్టు పేర్కొన్నది. ఏవో ఉద్దేశాలతో పిల్ దాఖలు చేయడం సరికాదని అభిప్రాయపడింది.
- పిల్ ఉద్దేశాలేమిటో విచారణలో తేటతెల్లం
- తేల్చి చెప్పిన హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం
High Court | హైదరాబాద్, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టుపై దాఖలైన ప్రజాహిత వ్యాజ్యం వెనుక ఎవరున్నారో తమకు తెలుసునని హైకోర్టు పేర్కొన్నది. ఏవో ఉద్దేశాలతో పిల్ దాఖలు చేయడం సరికాదని అభిప్రాయపడింది. ఇది ప్రజాప్రయోజన వ్యాజ్యమా..? ప్రచార వ్యాజ్యమా..? అని ప్రశ్నించింది. పిటిషనర్ తనకు తాను సీనియర్ అడ్వకేట్‌గా పేర్కొనడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. పిల్ వెనుక ఉద్దేశాలు ఏమిటో, పిల్ దాఖలు వెనుక ఎవరున్నారో విచారణలో తేల్చుతామని వెల్లడించింది. పిల్‌ను సవరించాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.
కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన వ్యవహారాలపై విచారణ జరిపించాలని, హైపవర్ కమిటీ ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేయాలంటూ ఎం విశ్వనాథరెడ్డి ప్రజాహిత వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. దీనిపై హైకోర్ట్ సీజే జస్టిస్ అలోక్ అరాధే, జడ్జి జస్టిస్ జే అనిల్‌కుమార్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. హైకోర్టు సర్టిఫై చేయకుండా పిటిషనర్ తనను తాను సీనియర్ న్యాయవాది గా ఎలా పేర్కొంటారని ప్రశ్నించింది. ఇవన్నీ చూస్తుంటే ప్రాజెక్టుపై పిల్ దాఖలు వెనుక ఎవరున్నారో అర్థమవుతున్నదని వ్యాఖ్యానించింది. పిటిషనర్ తరఫు న్యాయవాది జీ నందిత.. పిల్‌పై సత్వర విచారణ చేపట్టాలని కోరారు. వెంటనే స్పందించిన హైకోర్టు, ముందుగా సీనియర్ అడ్వకేట్‌గా పేరొనడాన్ని సవరించాలని పిటిషనర్‌ను ఆదేశించింది. పిల్‌ను ఏ పరిస్థితుల్లో దాఖలు చేయాలనే అంశంపై అధ్యయనం చేయాలని కూడా ఆదేశించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavya Maran Marriage | కేటీఆర్‌కు కళానిధి మారన్ దంపతుల ఆహ్వానం.. కావ్య మారన్ వివాహ రిసెప్షన్‌కు రావాలని పిలుపు!
Bathukamma Celebrations | ఎతుబార్పల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్‌ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
JCJ Results | మూడు రోజుల వ్యవధిలోనే రెండు కొలువులు.. జూనియర్ సివిల్ జడ్జిగా పెద్దపల్లి యువతి హారిక..!
హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

