మల్టీ జోన్-2 హెచ్ఎంల పదోన్నతులకు లైన్‌క్లియర్
రాష్ట్రంలో నిలిచిపోయిన ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ మళ్లీ ప్రారంభంకానున్నది. వీటిపై ఉన్న కేసులో సోమవారం హైకోర్టు తుది తీర్పు వెలువరించింది. దీంతో మల్టిజోన్2లోని హెచ్ఎం పదోన్నతులపై స్టేను హైకోర్టు ఎత్తివేసింది.
- హైకోర్టు స్టే ఎత్తివేత పట్ల హర్షం
- ప్రక్రియ ప్రారంభానికి ఉపాధ్యాయ సంఘాల వినతి
హైదరాబాద్, మార్చి 11(నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో నిలిచిపోయిన ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ మళ్లీ ప్రారంభంకానున్నది. వీటిపై ఉన్న కేసులో సోమవారం హైకోర్టు తుది తీర్పు వెలువరించింది. దీంతో మల్టిజోన్2లోని హెచ్ఎం పదోన్నతులపై స్టేను హైకోర్టు ఎత్తివేసింది. దీంతో టీచర్ల బదిలీలు, పదోన్నతులకు మార్గం సుగమమైంది. జీవో -317లో భాగంగా ఇతర జిల్లాల టీచర్లు రంగారెడ్డికి బదిలీ కాగా, రంగారెడ్డి జిల్లాలోని టీచర్లకు సీనియారిటీ జాబితాల్లో అన్యాయం జరిగిందని పలువురు కోర్టునాశ్రయించారు.
దీంతో మల్టిజోన్ -2లో హెచ్ఎంల పదోన్నతులకు బ్రేక్‌పడింది. దీంతో బదిలీలు, మిగతా పదోన్నతులు చేపట్టలేని పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా కోర్టు స్టేను ఎత్తివేయడంతో పదోన్నతులకు అనుమతి లభించింది. మల్టీజోన్ -2 ప్రధానోపాధ్యాయుల పదోన్నతులపై స్టేను హైకోర్టు ఎత్తివేయడం పట్ల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఏవీఎన్‌రెడ్డి హర్షం వ్యక్తంచేశారు. పాత షెడ్యూల్‌ను కొనసాగించేందుకు కోర్టు తీర్పునివ్వడాన్ని ఆయనతో పాటు తపస్ రాష్ట్ర అధ్యక్షుడు హనుమంతరావు, ప్రధానకార్యదర్శి నవాత్ సురేశ్ స్వాగతించారు. హెచ్ఎంల పదోన్నతులను తక్షణమే చేపట్టాలని కోరుతూ సోమవారం విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశంకు వినతిపత్రం అందజేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- High court
- HMs
- Teachers
- Transfers
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

