హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ): ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులతో సమానం గా మాజీ సైనికోద్యోగుల అర్హత మారులను తగ్గించాలని సైనిక్ సంక్షేమ డైరెక్టర్ రాసిన లేఖపై నిర్ణయం తీసుకునే వరకు గ్రూప్-4లో ఎక్స్-సర్వీస్మెన్ కోటా పోస్టులను భర్తీ చేయరాదని రాష్ట్ర ప్రభుత్వంతోపాటు టీఎస్పీఎస్సీకి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
గ్రూప్-4 నోటిఫికేషన్లో మాజీ సైనికోద్యోగుల అర్హత మారుల తగ్గింపుపై నిర్ణ యం తీసుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై జస్టిస్ పీ మాధవీదేవి ఇటీవల విచారణ జరిపారు. ఎక్స్-సర్వీస్మెన్ కోటా కింద ఎంతోమంది రాత పరీక్షలకు హాజరయ్యారని తెలిపారు. దీంతో సైనిక సంక్షేమ డైరెక్టర్ లేఖపై 30 రోజుల్లోగా తుది నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, టీఎస్పీఎస్సీని ఆదేశించిన హైకోర్టు.. తదుపరి విచారణను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది.