High Court | బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అసెంబ్లీకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవద్దని రాష్ట్ర డీజీపీకి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అలాగే బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేల పట్ల అనుచితంగా ప్రవర్తించిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ విచారించిన హైకోర్టు ఈ అంశంపై పూర్తి నివేదిక అందజేయాలని ఆదేశిస్తూ, కేసును రెండు వారాలకు వాయిదా వేసింది.
కాగా, సోమవారం కాంగ్రెస్ 1000 రోజుల పాలన వైఫల్యాన్ని నిరసిస్తూ నల్ల టీషర్టులతో అసెంబ్లీకి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మె ల్సీలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మధ్య తోపులాట జరి గింది. మహళా ఎమ్మెల్యేలు అని చూడా కూండా జుట్టు పట్టి, చీరలాగి అమానవీయంగా ప్రర్తించారు. పోలీసుల తీరును నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేపట్టాయి.