హైదరాబాద్, డిసెంబర్ 19, (నమస్తే తెలంగాణ): జూనియర్ కళాశాలల్లో టాయిలెట్ల నిర్మాణం, శానిటరీ నాపిన్ల ఏర్పాటుకు.. రా ష్ట్రంలో ప్రభుత్వం మార్పునకు సంబంధం ఏ మిటని హైకోర్టు ప్రశ్నించింది. జూనియర్ కాలేజీల్లో టాయిలెట్లను ఏర్పాటు చేయాలని ఇచ్చి న ఆదేశాలను అమలు చేయకుండా రా ష్ట్రంలో ప్రభుత్వం మారిందని చెప్పడం సబబు కాదని వ్యాఖ్యానించింది. పూర్తి వివరాలను నివేదించాలని, ఇప్పటికే చాలా సమయం ఇచ్చామని గుర్తు చేసింది.
తదుపరి విచారణను ఫిబ్రవరి 24కు వాయిదా వేసింది. సరూర్‌నగర్ ప్రభుత్వ జానియర్ కళాశాలలో 700 మంది విద్యార్థులకు ఒకే ఒక మరుగుదొడ్డి ఉందంటూ ఒక పత్రికలో వచ్చిన వార్త ఆధారంగా మణిదీప్ అనే విద్యార్థి రాసిన లేఖను హైకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. ప్రధాన న్యా యమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జే అనిల్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం మంగళవా రం మరోసారి విచారణ చేపట్టింది.
రాష్ట్ర వ్యా ప్తంగా జూనియర్ కళాశాలల్లో టాయిలెట్లతో పాటు బాలికల కోసం శానిటరీ నాపిన్ మెషన్లను ఏర్పాటు చేయాలని గతంలో ఇచ్చిన ఆదేశాల అమలు గురించి వివరించాలని కోరింది. ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ, ప్రభుత్వం మారడంతో గడువు కావాలని కోరడంపై హైకో ర్టు అసహనాన్ని వ్యక్తం చేసింది. జీవో 111కు ప్రభుత్వం వెసులుబాటు కల్పిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేసిన వ్యాజ్యంపై విచారణ సమయంలో కూడా గడువు కోరడంపై హైకోర్టు అసంతృప్తిని వ్యక్తం చేసింది.