హైదరాబాద్ : అధికారుల నిర్లక్ష్యం పశువుల కాపరుల(Herdsmen )ప్రాణాల మీదకు తెచ్చింది. ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా అధికారులు మూసీ ప్రాజెక్ట్(Musi project) గేట్లు ఎత్తివేయడంతో పశువుల కాపరులు వరదలో చిక్కుకుపోయారు. వివరాల్లోకి వెళ్తే..నల్లగొండ జిల్లా కేతపల్లి మండలం భీమారం గ్రామం లోని మూసి వాగులో ఒక్కసారిగా నీరు చుట్టుముట్టడంతో మధ్యలో పశువుల కాపరులు చిక్కుకుపోయారు. వ
రదలో ఇరవై బర్రెలు కొట్టుకుపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పశువుల కాపరులను ప్రొక్లెయినర్ సాయంతో బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ముందస్తు హెచ్చరికలు లేకుండా మూసీ ప్రాజెక్ట్ గేట్లు తెరిచిన అధికారులు..
వరదలో చిక్కుకుపోయిన పశువుల కాపరులు
నల్గొండ – కేతపల్లి మండలం భీమారం గ్రామంలోని మూసి వాగులో ఒక్కసారిగా నీరు చుట్టుముట్టడంతో మధ్యలో చిక్కుకుపోయిన పశువుల కాపరులు
వరదలో కొట్టుకుపోయిన ఇరవై గేదెలు.. చిక్కుకున్న… pic.twitter.com/pC29JeThpy
— Telugu Scribe (@TeluguScribe) September 22, 2024