Arvind Kejriwal | ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌కు.. అరవింద్ కేజ్రీవాల్ 5 ప్రశ్నలు
Arvind Kejriwal | ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని మోదీ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ సందర్భంగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్‌కు 5 ప్రశ్నలు సంధించారు.
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ప్రధాని మోదీ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ సందర్భంగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్‌కు 5 ప్రశ్నలు సంధించారు. ఢిల్లీ సీఎం పదవికి రాజీనామా చేసిన అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం జంతర్ మంతర్ వద్ద జరిగిన తొలి బహిరంగ సభ ‘జనతా కీ అదాలత్’లో ప్రసంగించారు. ప్రధాని మోదీ పార్టీలను విచ్ఛిన్నం చేయడం, ప్రలోభపెట్టడం, ఈడీ లేదా సీబీఐతో బెదిరించడం ద్వారా దేశవ్యాప్తంగా ప్రభుత్వాలను పడగొట్టడం సరైనదేనా? అని మోహన్ భగవత్‌ను ప్రశ్నించారు. ‘అత్యంత అవినీతి నాయకులను మోదీ తన పార్టీలో చేర్చుకున్నారు. వారిని అవినీతిపరులు అని స్వయంగా ఆయన పిలిచారు. అలాంటి రాజకీయాలను మీరు అంగీకరిస్తారా?’ అని నిలదీశారు.
కాగా, ఆర్ఎస్ఎస్ గర్భం నుంచి బీజేపీ పుట్టిందని, బీజేపీ దారితప్పకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆర్ఎస్ఎస్పై ఉందని అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. అలాంటప్పుడు మోదీ తప్పుడు పనులు చేయకుండా మీరు ఎప్పుడైనా ఆపారా? అని మోహన్ భగవత్‌ను ప్రశ్నించారు. ‘లోక్‌సభ ఎన్నికల సమయంలో తమకు ఆర్ఎస్ఎస్ అవసరం లేదని జేపీ నడ్డా అన్నారు. కొడుకు అంతగా ఎదిగిపోయాడా? మాతృసంస్థపై కొడుకు తన అసహనాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఆయన అలా చెప్పినప్పుడు మీకు బాధ కలగలేదా?’ అని నిలదీశారు. ‘75 ఏళ్ల తర్వాత నేతలు రిటైర్ అవుతారని మీరు (మోహన్ భగవత్) చట్టం చేశారు. మోదీకి ఈ రూల్ వర్తించదని అమిత్ షా చెబుతున్నారు. అద్వానీకి వర్తించేది మోదీకి ఎందుకు వర్తించదు?’ అని కేజ్రీవాల్ ప్రశ్నించారు.
మరోవైపు దేశానికి సేవ చేసేందుకు తాను రాజకీయాల్లోకి వచ్చానని, అధికారం లేదా పదవిపై దురాశతో కాదని అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. తనపై వచ్చిన అవినీతి ఆరోపణలతో బాధపడి సీఎం పదవికి రాజీనామా చేసినట్లు చెప్పారు. గత పదేళ్లలో తాను సంపాదించింది డబ్బు కాదని, గౌరవం మాత్రమేనని అన్నారు. త్వరలో జరుగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు తనకు అగ్ని పరీక్ష అని తెలిపారు. తాను నిజాయితీపరుడు కాదని భావిస్తే ప్రజలు తనకు ఓటు వేయవద్దని అన్నారు.
#WATCH | AAP national convenor Arvind Kejriwal says, “RSS people say that we are nationalists and patriots. With all due respect, I want to ask Mohan Bhagwat ji five questions- the way Modi ji is breaking parties and bringing down governments across the country by luring them or… pic.twitter.com/nWTxgbZCgl
— ANI (@ANI) September 22, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

