Balu Gani Talkies | తెలుగు ఓటీటీ వేదిక ఆహా మరో క్రేజీ ప్రాజెక్ట్‌తో మన ముందుకు వచ్చింది. ఇప్పటికే కొత్త పోరడు, భామ కలాపం, కలర్ ఫొటో వంటి చిత్రాలను తెరకెక్కించిన ఈ సంస్థ తాజాగా మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆహా సమర్పణలో వస్తున్న తాజా చిత్రం బాలు గాని టాకీస్ (Balu Gani Talkies). ఈ సినిమాకు విశ్వనాథన్ ప్రతాప్ దర్శకత్వం వహిస్తుండగా.. శివ రామ చంద్రవరపు (Shiva Rama Chandravarapu), శరణ్య శర్మ (Saranya Sharma) హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ ఫస్ట్ లుక్‌ను విడుదల చేయగా.. మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే తాజాగా ఈ సినిమా స్ట్రీమింగ్ తేదీని మేకర్స్ ప్రకటించారు. అక్టోబరు 4 నుంచి ఈ మూవీ ఆహాలో స్ట్రీమింగ్ అవ్వనున్నట్లు ప్రకటించింది.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఈ చిత్రంలో హీరో పేరు బాలు అని. అతడికి థియేటర్ ఉన్నట్లు అలాగే బాలకృష్ణకు వీరాభిమాని తెలుస్తుంది. బాలయ్య వీరాభిమాని అయిన బాలు జీవితంలో ఎదురైన సంఘటనలు ఏంటి అనేది తెలియాలి అంటే సినిమా వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఈ సినిమాను శ్రీనిధి సాగర్, పి రూపక్ ప్రణవ్ తేజ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రఘు కుంచె, సుధాకర్ రెడ్డి, వంశీ నెక్కంటి, సురేష్ పూజారి, శేఖర్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.