హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ) : ఉద్యోగుల ఆరోగ్యపథకం(ఈహెచ్ఎస్) అమల్లో సర్కార్‌కు ముందుచూపు కొరవడింది. ఒక నెల ప్రీమియం కట్‌చేశాక.. నెల రోజులకు ఉద్యోగుల వేతనం నుంచి ప్రీమియం కట్‌చేసేందుకు అనుమతినిస్తూ సర్కార్ తాజాగా జీవో జారీచేసింది. జూన్ 1న ఉద్యోగులకు చెల్లించిన మే నెల జీతంలోనే 1.5% తొలి ప్రీమియంగా కట్‌చేశారు. కట్‌చేసిన మొత్తం సర్కార్ వద్దే ఉండిపోయింది.
వాస్తవానికి మొదట ట్రస్టును ఏర్పాటు చేయాలి. ఈ ట్రస్టు పేరిట అకౌంట్ తీయాలి. ఆ తర్వాత 1.5% కట్‌చేసేందుకు వీలు కల్పిస్తూ జీవో జారీచేయాలి. ఆ తర్వాతే ప్రీమి యం కట్‌చేయాలి. ఇవేవీ లేకుండానే మే నెల జీతంలో 1.5% కట్‌చేశారు. తాజా గా జూలై 1న అందజేసే జూన్ జీతం నుంచి 1.5% కట్చేయాల్సి ఉంది. భార్యాభర్తలు ఉద్యోగులు.. పెన్షనర్లు అయితే ఒక్కరి నుంచే ప్రీమియం వసూ లు చేస్తామని ప్రభుత్వం తెలిసింది.