హైదరాబాద్, ఫిబ్రవరి14 (నమస్తే తెలంగాణ): కులగణ సర్వేలో పాల్గొనని వారి కోసం ప్రభుత్వం రీసర్వే నిర్వహిస్తున్నదని, దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలని సంబంధిత అధికారులను రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ ఆదేశించారు. ఖైరతాబాద్‌లోని కమిషన్ కార్యాలయంలో శుక్రవారం మీడియాతోమాట్లాడారు.
జీహెచ్ఎంసీ ఏరియాలో ఎక్కువశాతం కులగణన జరగలేదని అంటున్నారని, ఈ నేపథ్యంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం టోల్ ఫ్రీ నంబర్, ప్రజాపాలన సేవా కేంద్రాలు, ఆన్లైన్ ద్వారా వివరాల నమోదుకు అవకాశం కల్పించిందని తెలిపారు.