తడిసిన, రంగుమారిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత రైతుకూలీ సంఘం (ఏఐకేఎంఎస్) ఆధ్వర్యంలో రైతులు భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్ ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. అదనపు కలెక్టర్ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో నాయకులు, రైతులు ఆందోళన విరమించారు.

ఔటర్ రింగ్ రోడ్డు నుంచి ఫోర్త్ సిటీని కలుపుతూ.. కల్వకుర్తి నియోజకవర్గంలో ఆకుతోటపల్లి వరకు ప్రభుత్వం గ్రీన్ఫీల్డ్ రోడ్డు నిర్మించాలని నిర్ణయించింది. ఇందుకోసం ప్రభుత్వం చేపట్టిన రెండో విడత గ్రీన్ ఫీల్డ్ రోడ్డు సర్వే పనులను సోమవారం రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలంలోని ఏక్వాయిపల్లి, మర్రిపల్లి గ్రామాలకు చెందిన రైతులు ఏక్వాయిపల్లిలో అడ్డుకున్నారు.