Telangana | హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన 40 మండలాల్లో ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ విభాగాన్ని బలోపేతం చేసేందుకు దాని పరిధిలోని మానవ వనరుల హేతుబద్ధీకరణ ప్రక్రియకు చర్యలు చేపట్టింది. పేషెంట్ లోడ్‌కు అనుగుణంగా తగిన వైద్య సిబ్బందిని నియమించేందుకు ఆమోదం తెలుపుతూ మార్గదర్శకాలు రూపొందించింది. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ విభాగాన్ని బలోపేతం చేయాలన్న లక్ష్యంతో వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఏర్పాటు చేసిన కమిటీ ఇటీవల పలు ప్రతిపాదనలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందించింది. పరిశీలించిన ప్రభుత్వం ప్రతిపాదనలకు ఆమోదం తెలుపుతూ గురువారం జీవో నంబర్ 142ను విడుదల చేసింది.
మార్గదర్శకాలు ఇవే..