Godavari River | గతంలో ఎన్నడూ లేనివిధంగా యాసంగి సీజన్ ఆరంభంలోనే నీళ్లు లేక గోదావరి నది వెలవెలబోతున్నది. ప్రభుత్వం ఎస్సారెస్పీ నుంచి నీటిని విడుదల చేయకపోవడంతో జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలంలో నది ఇలా రాళ్లుతేలింది. కొల్వాయి, చిన్న కొల్వాయి, రేకులపల్లి, కమ్మునూర్, తాళ్ల ధర్మారం, మంగెళ తదితర గ్రామాల రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. ప్రస్తుతం నారు పోసుకొని నాట్లు వేసుకోగా, నీటి లభ్యత లేకపోతే ఎలా గట్టెక్కేదని వాపోతున్నారు.
గోదావరి జలాల కోసం రైతులు కాలువలో కూర్చుని నిరసన తెలిపారు. సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలంలో ఎస్సారెస్పీ కాల్వలు సరైన నిర్వహణ లేక పూడిపోయాయి. వారబందీ పద్ధతిలో గతవారం నీటిని విడుదల చేసినప్పటికీ కంపలు, పూడిక నిండడంతో నీళ్లు పారడం లేదు. పంటలు ఎండిపోతున్న పరిస్థితుల్లో విసుగెత్తిన కొమ్మాల రైతులు మంగళవారం మైనర్ కాలువలో కూర్చొని ఇలా నిరసన తెలిపారు.