కామారెడ్డి : ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నిజాంసాగర్ ( Nizamsagar) ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది . ప్రాజెక్ట్‌కు వరద తీవ్రత ఎక్కువ ఉండడంతో అత్యవసర పరిస్థితుల దృష్ట్యా మరికొద్ది సేపట్లో నిజాంసాగర్ గేట్లను ఎత్తనున్నారు. ఎగువ ప్రాంతం నుంచి 26,800 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుందని ప్రాజెక్టు అధికారులు వెల్లడించారు.
ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1405 అడుగులు కాగా ప్రస్తుతం 1403 అడుగుల వరకు నీరు వచ్చి చేరింది. ప్రాజెక్టు నీటి నిలువ సామర్థ్యం 17.802 టీఎంసీలు కాగా ప్రస్తుతం 14.568 టీఎంసీ నీరు నిలువ ఉందని వివరించారు. ఎగువ నుంచి భారీ వరద కారణంగా ప్రాజెక్టు గేట్లను ఎత్తనున్నామని వెల్లడించారు.
దీని వల్ల నిజాంసాగర్ పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. నీటి ప్రధాన కాలువ పరిసర ప్రాంత ప్రజలు, పశువుల కాపరులు జాగ్రత్తగా ఉండాలని కోరారు.