ఎస్సారెస్పీ ఆయకట్టుకు గోదావరి నీటిని అందించి వరి పంటలను కాపాడాలని డిమాండ్ చేస్తూ రైతులు రోడ్డెక్కారు. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండల కేంద్రంలోని సూర్యాపేట-దంతాలపల్లి ప్రధాన రహదారిపై శుక్రవారం రెండు గంటల పాటు రాస్తారోకో చేశారు.