Power Cuts | కాశీబుగ్గ, ఆగస్టు 15: గ్రేటర్ వరంగల్‌లోని కాశీబుగ్గ ఓసిటీ రోడ్డులోని సబ్‌స్టేషన్ పరిధి విద్యుత్తు అధికారులు వినియోగదారుడిని బూతులు తిట్టినట్టు సోషల్ మీడియాలో వైరల్ అయింది. గురువారం విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో కాశీబుగ్గ వినియోగదారుడు కరుణాకర్‌రెడ్డి విద్యుత్తు అధికారులకు ఫోన్ చేసి కరెంటు పోయిందని సమాచారం ఇచ్చాడు. దీంతో అధికారులు బూతులు తిట్టినట్టు ప్రచారం జరుగుతున్నది.
అధికారి మద్యం మత్తులో ఉన్నట్టు తెలిసింది. ఇరువురి మధ్య మాటామాటా పెరగడంతో వినియోగ దారుడిని బూతులు తిట్టినట్టు తెలిసింది. స్వాతంత్య్ర దినోత్సవం రోజున మద్యం మత్తులో ఉన్న అధికారితోపాటు మరో ఉద్యోగి దూషించినట్టు ప్రచారం జరుగుతున్నది. కాశీబుగ్గకు చెందిన విద్యుత్తు ఏఈపై గతంలో ఆరోపణలు వచ్చినట్టు తెలిసింది. మద్యం మత్తులో బూతులు మాట్లాడిన అధికారుల ఫోన్ ఆడియో రికార్డులను విద్యుత్తు శాఖ సీఎండీ దృష్టికి తీసుకెళ్లనున్నట్టు బాధితుడు తెలిపాడు.