నమస్తే తెలంగాణ న్యూస్‌నెట్‌వర్క్, మే 16: సీఎం కేసీఆర్ సర్కారు చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్శితులై ప్రధాన పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున బీఆర్ఎస్లో చేరుతున్నారు. మంగళవారం కూడా పలు ప్రాంతాల్లో వివిధ పార్టీల నాయకులు గులాబీ కండువాలు కప్పుకొన్నారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజక వర్గంలోని భీమ్‌గల్ మండలం భీమ్‌గల్, బడాభీమ్‌గల్, చేంగల్, ముచ్కూర్, బాబాపూర్, గోన్‌గొప్పుల గ్రామాల నుంచి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన సుమారు 200 మంది యువకులు హైదరాబాద్‌లో బీఆర్ఎస్లో చేరగా రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
సూర్యాపేట పట్టణంలోని 8వ వార్డులో కాంగ్రెస్ పార్టీకి చెందిన 30 కుటుంబాలు పెద్దగట్టు మాజీ చైర్మన్ కడారి సతీశ్‌యాదవ్ ఆధ్వర్యంలో విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరాయి. నాగర్‌కర్నూల్ జిల్లా బల్మూరు మండలంలోని రాంనగర్‌తండాలో 20 మంది బీఎస్పీ కార్యకర్తలు గిరిజన మంత్రి సత్యవతి, విప్ గువ్వల బాలరాజు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం దత్తాపూర్ ఎంపీటీసీ బానోత్ గంగాదేవి, ఆమె భర్త మహేశ్‌తోపాటు వందలాది మంది బీజేపీ కార్యకర్తలు హైదరాబాద్‌లో బీఆర్ఎస్లో చేరారు. ఆర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఏ జీవన్‌రెడ్డి గులాబీ కండువాలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. నల్లగొండ జిల్లా పీఏపల్లి మండలంలోని గుడిపల్లిలో ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్, బీజేపీ నుంచి పలువురు బీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించారు.