ధర్మారం, ఏప్రిల్ 16: అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్ పాలనలో ఘోరంగా విఫలమైందని జగిత్యాల సభ ధర్మపురి నియోజకవర్గ ఇన్చార్జి, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు ఆరోపించారు. జగిత్యాల సభ సన్నాహక సమావేశాన్ని గురువారం రాత్రి పెద్దపల్లి జిల్లా ధర్మారంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో కలిసి పార్టీ శ్రేణులతో నిర్వహించి, మాట్లాడారు.
ధర్మారం మండలం నుంచి 2,500 మంది తరలిరావాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌పై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడిందని, బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వచ్చి కేసీఆర్ సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు.