మహబూబాబాద్ జిల్లా నర్సింహులుపేట మండల కేంద్రానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న రూప్లా తండా గ్రామపంచాయతీ పరిధిలోని బీల్యాతండా ఇది. ఈ తండాకు 148 ఏండ్ల చరిత్ర ఉన్నది. 84 ఇండ్లు, 400 జనాభా. ఎంతో మంది నాయకులు దేశాన్ని, రాష్ర్టాన్ని పాలించారు. ఇన్నేండ్లలో ఆ తండాను పట్టించుకున్న నాథుడే లేడు. రోగమో, రొష్టో వస్తే దవాఖానకు పోవడానికి రస్తా లేదు. కాన్పుల కోసమైతే కన్నమ్మ కష్టాలు పడాల్సిందే.
వానకాలమైతే ఇక నరకమే. చుక్క నీటి కోసం పొలం గట్ల వెంట నిత్యం సర్కస్ చేయాల్సిందే. ఇన్నేండ్లలో ఎన్నో ప్రమాదాలు.. ఏ పాలకుడూ కనికరించలేదు.. 2015 వరకు ఇదే దుస్థితి. ఇన్నేండ్లు అరిగోస పడ్డ మారుమూల బీల్యా తండాకు ఇప్పుడు సీసీరోడ్డు వచ్చింది. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నల్లా వచ్చింది. మొత్తం తండా ముఖచిత్రమే మారిపోయింది. స్వరాష్ట్రం సిద్ధించాక కేసీఆర్ మార్క్ అభివృద్ధి మారుమూల ప్రాంతాలకూ విస్తరించింది అనటానికి ఇదే నిదర్శనం.