వ్యవసాయ యూనివర్సిటీ, డిసెంబర్ 16: దేశానికి అన్నంపెట్టే రైతన్నకు అండగా ఉంటు న్న తమ సమస్యలు పట్టించుకోరా? అని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ విద్యార్థులు ప్రభుత్వాన్ని నిలదీశారు. మంత్రులు ఇచ్చిన హామీలన్నింటిని నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ మంగళవారం వర్సిటీ ప్రధాన కూడలి వద్ద నిరసన తెలిపారు. అనంతరం జయశంకర్ విగ్రహానికి వినతిపత్రం అందజేసి, భారీ ర్యాలీగా వీసీ భవన్కు వెళ్లి ఆందోళన చేపట్టారు.
ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ.. రియల్ వ్యాపారాన్ని పెంపొందించుకునే కుట్రలో భాగంగా వర్సిటీలో హైకోర్టు పనులు చేపట్టారని ఆరోపించా రు. విద్యార్థులు అడ్డుకోవడంతో ఏడాది క్రితం మంత్రులు హామీలిచ్చారని గుర్తుచేశారు. ఇప్పటికీ పైసా కేటాయించలేదని, చందాలతోనే వర్సిటీ ఖర్చులు వెళ్లదీసుకుంటున్నామని వాపోయారు. రేవంత్ ప్రభుత్వం త్వరగా స్పందించకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు.