డిస్కమ్ ప్రతిపాదనల వెనుక స్కామ్
రైతు డిస్కమ్ ప్రతిపాదనల వెనుక భారీ స్కామ్ దాగి ఉన్నదని, కేంద్ర ప్రభుత్వ రైతువ్యతిరేక నిర్ణయాలకు రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ వంత పాడుతున్నదని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి మండిపడ్డారు.
- రైతు వ్యతిరేక విధానాలపై బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కు
- కుంభకోణాలకు కేరాఫ్ గా కాంగ్రెస్ సర్కార్: వేముల
కామారెడ్డి, జూన్ 4: రైతు డిస్కమ్ ప్రతిపాదనల వెనుక భారీ స్కామ్ దాగి ఉన్నదని, కేంద్ర ప్రభుత్వ రైతువ్యతిరేక నిర్ణయాలకు రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ వంత పాడుతున్నదని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి మండిపడ్డారు. వ్యవసాయ రంగానికి నష్టం కలిగించే యూరియా యాప్, ఆర్డీఎస్ఎస్ రైతు డిస్కమ్ ఏర్పాటు ప్రతిపాదనను రేవంత్ సర్కార్ మద్దతు ఇస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్రం ప్రతిపాదించిన ఆర్డీఎస్ఎస్ రైతు డిస్కమ్‌ను వెన క్కి తీసుసుకోవాలని, యాప్ విధానాన్ని రద్దు చేసేలా చూడాలని బీజేపీ ఎంపీలను డిమాం డ్ చేశారు. గురువారం కామారెడ్డిలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు, ‘సర్’పై అవగాహన సదస్సులో వేముల మా ట్లాడుతూ.. కేసీఆర్ పాలనలో రైతులకు ఎరువులు, యూరియా కొరతలేకుండా రికార్డుస్థాయిలో సరఫరా చేశామని గుర్తుచేశారు. ప్రస్తుతం రేవంత్ పాలనలో రైతులు యూరి యా కోసం ఇబ్బందులు పడుతున్నారన్నారు.
అస్తిత్వాన్ని ప్రశ్నిస్తే స్పందించరా?
ఇటీవల ఆంధ్రా ప్రాంతానికి చెందిన కొందరు తెలంగాణ ఉనికి, అస్తిత్వాన్ని ప్రశ్నించేలా మాట్లాడుతున్నా రేవంత్ సర్కార్ నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తున్నదని ఆగ్ర హం వ్యక్తంచేశారు. టీటీడీపీ అధ్యక్షుడు నరసింహు లు డిక్షనరీలో తెలంగాణ పదమే లేదంటే.. సీఎం రేవంత్‌రెడ్డి, కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ ఖండించకపోవడం వారి కపటనీతికి నిదర్శనమని విమర్శించారు.
అన్నింట్లోనూ కుంభకోణాలే..
విద్యుత్తురంగంలో ప్రవేశపెట్టనున్న రైతు డిస్కమ్ వెనుక రూ.వేల కోట్ల కుంభకోణం ఉన్నదని ఆరోపించారు. పౌరసరఫరాలు, ఎక్పైజ్, ఎండోమెంట్, సింగరేణి, విద్యుత్తు వంటి పలు శాఖల్లో రూ.వేల కోట్ల కుంభకోణాలు జరుగుతున్నాయని మండిపడ్డారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

