సూర్యాపేట : సూర్యాపేట(Suryapet) ప్రభుత్వ జనరల్ హాస్పిటల్(Government General Hospital) వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. వైద్యుల నిర్లక్ష్యంతో(Doctors negligence) తమ కుమార్తె హరిస్మిత(17) మృతి చెందిందని ఆరోపిస్తూ సదరు డాక్టర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని బాలిక తల్లిదండ్రులు, బంధువులు జనరల్ హాస్పిటల్ ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన రత్నావత్ సైదులు, రమ్యల కుమార్తె హరిస్మిత(17) ట్రాన్సిల్స్తో బాధపడుతూ సూర్యాపేట ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌కు మే 20న వచ్చింది.
పరిశీలించిన సదరు డాక్టర్లు ఆపరేషన్ అవసరమని గుర్తించి ఆపరేషన్‌కు సంబంధించిన పరీక్షలను చేశారు. అనంతరం ఆపరేషన్ థియేటర్లోకి ఉదయం తొమ్మిది గంటల సమయంలో తీసుకువెళ్లారు. మధ్యాహ్నం అవుతున్నా తమ కుమార్తె ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు హెచ్ఓడీని కలిశారు.
అనస్థీషియా వేయడంతో యువతి అపస్మారక స్థితికి వెళ్లిందని, ఇక్కడ వైద్య సదుపాయాలు లేవని హైదరాబాద్‌లోని గాంధీ హాస్పిటల్‌కు పంపించారు. అక్కడ రెండు రోజులు వైద్యం అందించినప్పటికీ యువతి ఈ నెల 4న మృతి చెందింది. దీంతో సదరు వైద్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి యువతి కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆందోళ చేపట్టారు.