జమ్మికుంట, అక్టోబర్ 8: మైనార్టీ రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో ఆమోదం పొందకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటున్నదని తెలంగాణ ముస్లిం ఫకీర్ వెల్ఫేర్ అసోసియేషన్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ సాబీర్ అలీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పడ్డారు. శనివారం కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో మాట్లాడుతూ.. మైనార్టీల పట్ల పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్న బీజేపీకి వచ్చే ఎన్నికల్లో గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ఆర్థికంగా వెనుకబడిన ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ అమలు చేయాలనే ఉద్దేశంతో రాష్ట్రప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించిందని గుర్తు చేశారు. ఏండ్లు గడుస్తున్నా ఈ విషయంలో బీజేపీ సర్కారు నాన్చివేత ధోరణిని అవలంబిస్తున్నదని ఆయన మండి1947 నుంచి నేటి వరకు ముస్లిం ఫకీర్లకు రాజ్యాంగం కల్పించిన హక్కులు దక్కట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లిన సీఎం కేసీఆర్ వెంట నడుస్తామని స్పష్టం చేశారు.