మానకొండూర్ రూరల్, నవంబర్ 17 : మంచానికి పరిమితమైన వృద్ధురాలిని ఆమె కాల్చిన బీడే దహించి వేసింది.
కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం శ్రీనివాస్‌నగర్‌లో బొడ్డు పోచమ్మ (90),ఎల్లవ్వ అనే అత్తా కోడళ్లు ఉంటున్నారు. ఆదివారం కోడలు పనికి వెళ్లగా, పోచమ్మ బీడీ తాగి పడుకుంది. బీడీ మంచంలోనే పడి మంటలంటుకున్నాయి. కాలు విరిగి లేవలేని స్థితిలో ఉన్న పోచమ్మ అరుపులతో చుట్టుపక్కల వారు కరీంనగర్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమించడంతో వరం గల్‌కు తరలి స్తుండగానే పోచమ్మ మృతి చెందింది