కరీంనగర్ : అమలు సాధ్యం కానీ హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి అప్పుడే ప్రజల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమువుతున్నది. ఆరు గ్యారంటీలు దేవుడెరుగు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలనైనా అమలు చేయాలని ప్రజలు రోడ్డెక్కుతున్నారు. అందులో భాగంగాజిల్లాలోని హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికిచెందిన దళితబంధు( Dalitha Bandhu) లబ్ధిదారులు.. రెండవ విడుత నిధులను విడుదల చేయకపోవడాన్ని నిరసిస్తూ(Protest) సోమవారం కరీంగనర్ కలెక్టరేట్లోని ప్రజావాణికి భారీగా తరలి వచ్చారు.
అధికారులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. అయినా అధికారులనుంచి సరైన స్పందన సమాధానం రాకపోవడంతో ఆందోళనకు దిగారు. దీంతో.. ప్రజావాణిలో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. ఇకనైనా వెంటనే రెండవ విడుత నిధులు విడుదల చేయాలని లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
దళితబంధు పథకాన్ని కొనసాగిస్తారా లేద అనే విషయంలో కూడా ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే నల్లగొండ నియోజకవర్గంలో ఇప్పటికే ప్రొసీడింగ్స్ ఇచ్చిన దళిత బంధు( Dalith Bandhu)ను గ్రౌండింగ్ (Grounding) చేయాలని డిమాండ్ చేస్తూ సాధన సమితి ఆధ్వర్యంలో నల్లగొండ(Nallagonda) కలెక్టరేట్ ముందు భారీ ధర్నాకు దిగారు.