పోలవరం ముంపు సర్వేపై ఏపీ మీనమేషాలు
పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ముంపుపై సంయుక్త సర్వే నిర్వహించే విషయంలో ఏపీ సర్కారు మీనమేషాలు లెక్కిస్తున్నది. గత జనవరి 25న కేంద్ర జల్‌శక్తిశాఖ ఆధ్వర్యంలో ఢిల్లీలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలోనే సంయుక్త సర్వే నిర్వహించాలని సీడబ్ల్యూసీ స్పష్టమైన ఆదేశాలిచ్చినా అడుగు ముందుకు పడలేదు.
- కేంద్ర జల్‌శక్తి ఆదేశాలు బేఖాతర్
- మరోసారి కొత్తగూడెం సీఈ లేఖ
హైదరాబాద్, మార్చి 27 (నమస్తే తెలంగాణ): పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ముంపుపై సంయుక్త సర్వే నిర్వహించే విషయంలో ఏపీ సర్కారు మీనమేషాలు లెక్కిస్తున్నది. గత జనవరి 25న కేంద్ర జల్‌శక్తిశాఖ ఆధ్వర్యంలో ఢిల్లీలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలోనే సంయుక్త సర్వే నిర్వహించాలని సీడబ్ల్యూసీ స్పష్టమైన ఆదేశాలిచ్చినా అడుగు ముందుకు పడలేదు. అయినప్పటికీ పీపీఏ స్పందించ డం లేదు. ఇదే విషయమై తెలంగాణ సర్కారు ఇప్పటికే పలుమార్లు పీపీఏకు, సీడబ్ల్యూసీకి లేఖలు రాసినప్పటికీ ఫలితం లేదు. సంయుక్త సర్వే చేపట్టేందుకు పీపీఏ చొరవ చూపడం లేదు. తాజాగా కొత్తగూడెం సీఈ మరోసారి ఇదే విషయమై పీపీఏకు లేఖ రాశారు.
పోలవరం ఎత్తుపై కేంద్రం పూటకో మాట
పోలవరం ప్రాజెక్టు ఎత్తుపై కేంద్రం పార్లమెంటులో పూటకో మాట చెప్తున్నది. పోలవ రం ప్రాజెక్టు ఎత్తు 45.72 మీటర్లు అని ఒకసారి, 41.15 మీటర్లకే పరిమితం చేశామని మరోసారి ప్రకటనలు చేస్తున్నది. పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గించాలని ఏపీ ప్రభుత్వం ఏమైనా ప్రతిపాదనలు చేసిందా? అని సోమవారం రాజ్యసభలో ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ ప్రశ్నించగా అందుకు కేంద్ర జల్‌శక్తి సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఏపీ ప్రతిపాదించినట్టు తమవద్ద సమాచారం ఏమీ లేదని చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మంత్రిగారి సిఫార్సు.. మహా కుంభకోణం వివేక గంగాధరం!
రైతన్నపై ఆంక్షలు.. కాలువల్లో మోటర్లు వాడొద్దు.. నీళ్లు తోడొద్దు
పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
రేవంత్ సర్కార్‌లో అన్నీ స్కామ్‌లే.. కార్మికుల సొమ్మునూ వదలట్లే
కమీషన్ల కోసమే కొడంగల్-పేట ఎత్తిపోతలు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

