
హైదరాబాద్ : చరిత్ర సృష్టించిన రైతుబంధు పథకంపై ఎల్లెడలా హర్షాతి రేకాలు వ్యక్తమవుతున్నాయి. దేశానికి అన్నం పెట్టే రైతు కంటతడి పెట్టొద్దనే తలంపుతో సీఎం కేసీఆర్ సాగులో కష్టాలు తలెత్తకుండా రైతుబంధు పథకాన్ని తీసుకొచ్చారు.
పంట పెట్టుబడి సాయం కోసం తెచ్చిన ఈ పథకం యావత్ తెలంగాణ రైతాంగంలో విప్లవాత్మక మార్పును తీసుకొచ్చింది. పెట్టుబడికి తిప్పలు పడకుండా సకాలంలో సాగు పనులు చేస్తూ రైతులు పుష్కలంగా పంటలు పండిస్తున్నారు.
తండ్రి వలె రైతుల కష్టాలను అర్థం చేసుకొని కన్నీళ్లను తుడుస్తున్న సీఎం కేసీఆర్ చిత్రపటాలకు అన్నదాతలు పాలాభిషేకాలు చేస్తూ, హారతులు పడుతూ..ఊరేగింపులు తీస్తూ ఇలా వివిధ రూపాల్లో తమ కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
తాజాగా ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో రైతు బాంధువుడు సీఎం కేసీఆర్పై మిర్చి రైతులు వినూత్నంగా మిరప కల్లంలో జై కేసీఆర్, జై రైతుబంధు అని రాసి తమ అభిమానాన్ని చాటుకున్నారు.
