జనగామ, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ) : ‘కడియం.. నీకు సిగ్గు, శరం ఉందా? బీఆర్ఎస్ నుంచి గెలిచిన నీవు అధికార దాహంతో కాంగ్రెస్‌లో చేరినవ్.. వెంట నే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్’ అని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఘాటు వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయ న జనగామలో మాట్లాడారు.
కడియం శ్రీహరి ఏ పార్టీలో ఉన్నాడో కూడా చెప్పుకోవడానికి భయపడి ఇప్పటి వరకు స్పీకర్‌కు వివరణ ఇవ్వలేదని ఎద్దేవా చేశారు.