హైదరాబాద్: ఇరాన్ కొత్త అధ్యక్షుడిని శుక్రవారం ఆ దేశ ప్రజలు ఎన్నుకోనున్నారు. తెలంగాణలోని హైదరాబాద్ సహా ప్రపంచంలోని పలు ప్రాంతాలలో బ్యాలెట్ బాక్స్‌లను సిద్ధం చేసినట్టు అధికారులు తెలిపారు. హైదరాబాద్‌లోని ఇరాన్ కాన్సులేట్ కార్యాలయంలో బ్యాలెట్ బాక్స్‌ను ఉంచామని, అర్హులైన ఇరాన్ పౌరులు హైదరాబాద్‌లోనే తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చునని చెప్పారు.
గత నెల హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మరణించారు. ఆయన మంత్రివర్గంలో ఉపాధ్యక్షుడిగా ఉన్న మహమ్మద్ మోక్బెర్ సహా నలుగురు కన్జర్వేటివ్‌లు, ఒక రిఫామిస్ట్ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నారు.