TGSRTC | బెంగళూరు – హైదరాబాద్ మధ్య ప్రయాణించే ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ శుభవార్త తెలిపింది. ప్రయాణికుల సౌకర్యం కోసం రెండు మెట్రో సిటీల మధ్య నడిచే ఏసీ స్లీపర్, నాన్ ఏసీ బస్సులకు బోర్డింగ్, అలైటింగ్ పాయింట్లను భారీగా పెంచినట్లుగా ప్రకటించింది. దీనివల్ల ప్రయాణికులు తమకు దగ్గరలోని ప్రాంతాల్లో సులభంగా బస్సు ఎక్కడానికి, దిగడానికి వీలు ఉంటుందని తెలిపింది.
బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చే అన్ని సర్వీసుల ప్రయాణికుల కోసం నగరంలోని ప్రధాన మార్గాల్లో కింది విధంగా స్టాప్‌లు అందుబాటులో ఉంటాయి
పటాన్చెరు రూట్ : పటాన్చెరు నుంచి ఎంజీబీఎస్ (MGBS), ఆరాంఘర్, శంషాబాద్ వరకు ఉన్న అన్ని ప్రధాన స్టేజీలలో..
జేబీఎస్ రూట్: జేబీఎస్ (JBS) నుంచి ఎంజీబీఎస్, ఆరాంఘర్, శంషాబాద్ వరకు ఉన్న అన్ని ప్రధాన స్టేజీలలో..
హయత్ నగర్ రూట్: హయత్ నగర్ నుంచి ఎంజీబీఎస్, ఆరాంఘర్, శంషాబాద్ వరకు ఉన్న అన్ని ప్రధాన స్టేజీలలో బోర్డింగ్/అలైటింగ్ పాయింట్లు కలవు.
1. పీనియా రూట్ (via Peenya): పీనియా (Peenya), యశ్వంతపూర్ మెట్రో స్టేషన్ (Yeshwanthpur Metro Station), కెంపెగౌడ బస్ స్టేషన్ (మెజెస్టిక్), హెబ్బల్ (Hebbal), ఎస్టీమ్ మాల్ (Esteem Mall), ఎలాహంక (Yelahanka), బెంగళూరు ఎయిర్ పోర్ట్ టోల్ ప్లాజా, దేవనహళ్లి బైపాస్
2.చందాపూర్ రూట్ (via Chandapura) : చందాపూర్, బొమ్మసంద్ర (Bommasandra), ఎలక్ట్రానిక్ సిటీ (Electronic City), బొమ్మనహళ్లి మెట్రో స్టేషన్, మడివాళ (Madiwala), కెంపెగౌడ బస్ స్టేషన్, హెబ్బల్ & ఎస్టీమ్ మాల్, ఎలాహంక, బెంగళూరు ఎయిర్ పోర్ట్ టోల్ ప్లాజా, దేవనహళ్లి బైపాస్.
3. మార్తహళ్లి రూట్ (via Marathahalli): వర్తూర్ జంక్షన్ (Varthur Junction), మార్తహళ్లి, దొమ్లూరు బ్రిడ్జి (Domlur Bridge), కెంపెగౌడ బస్ స్టేషన్, హెబ్బల్ & ఎస్టీమ్ మాల్, ఎలాహంక, బెంగళూరు ఎయిర్ పోర్ట్ టోల్ ప్లాజా, దేవనహళ్లి బైపాస్.
ఈ అవకాశాన్ని బెంగళూరు, హైదరాబాద్ మధ్య ప్రయాణించే ప్రయాణికులు వినియోగించుకోవాలని టీజీఎస్ ఆర్టీసీ సూచించింది. ముందస్తు బుకింగ్స్ కోసం అధికారిక వెబ్సైట్ www.tgsrtcbus.in ను సందర్శించాలని తెలిపింది.