Baththa | విజయ్ సేతుపతి ‘బత్తా’ టీజర్ విడుదల.. వింటేజ్ లుక్‌లో అదరగొట్టిన మక్కల్
Vijay Sethupathi | కోలీవుడ్ స్టార్ హీరో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నటిస్తున్న తాజా చిత్రం ‘బత్తా’. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.
Vijay Sethupathi | కోలీవుడ్ స్టార్ హీరో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నటిస్తున్న తాజా చిత్రం ‘బత్తా’ (Baththa). తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ‘నడువుల కొంచెం పక్కతా కానుము్’, ‘సీతకాతి’ వంటి విభిన్న చిత్రాల తర్వాత విజయ్ సేతుపతి, దర్శకుడు బాలాజీ తరుణీధరన్ కాంబినేషన్లో వస్తున్న మూడో సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
పూర్తిగా 1960ల నాటి వింటేజ్ బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడికల్ యాక్షన్ మరియు ఎమోషనల్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి సరసన ‘జై భీమ్’ ఫేమ్ లిజో మోల్ జోస్ హీరోయిన్గా నటిస్తోంది. ఇక ఈ సినిమాకు సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తుండగా, ఇటీవల విడుదలైన ‘మగలే’ అనే తండ్రీకూతుళ్ల భావోద్వేగ పాట ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ప్రముఖ దర్శకుడు అట్లీ ఈ చిత్రాన్ని ప్రెజెంట్ చేస్తుండటం విశేషం. విజయ్ సేతుపతి వింటేజ్ లుక్‌లో బీడీ కాలుస్తూ చాలా డిఫరెంట్ స్టైల్లో కనిపిస్తున్న ఈ సినిమా టీజర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచేసింది. ఈ సినిమా విడుదల తేదీని త్వరలోనే మేకర్స్ ప్రకటించనున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Menopause | భారతీయ మహిళల్లో పెరుగుతున్న ముందస్తు మెనోపాజ్.. నిపుణులు ఏమంటున్నారు..?
వాల్మీకి మహర్షి బోధనలు నేటి సమాజానికి మార్గదర్శకం : చిట్టెం రామ్మోహన్‌రెడ్డి
Kangana Ranaut | రవిబాబు హారర్ సినిమాలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్.. 17 ఏళ్ల తర్వాత టాలీవుడ్లోకి రీఎంట్రీ?
Gujarat: వీహెచ్‌పీ డిమాండ్‌తో.. ప్రభుత్వ మ్యాగ్జిన్ నుంచి వివాదాస్పద కవిత తొలగింపు
Jailer 2 | జైలర్ 2 బాక్సాఫీస్ సునామీ.. 11 రోజుల్లోనే రూ.700 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

