Ship Collision: అరేబియా సముద్ర జలాల్లో ఢీకొన్న పాక్, భారత నౌకలు
Ship Collision: అంతర్జాతీయ సముద్ర జలాల్లో ఇండో, పాక్ నౌకలు ఢీకొన్నాయి. ఈ ఘటనపై ఇవాళ భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. పాకిస్థాన్ నౌకాదళ వ్యవహారం ఆమోదయోగ్యంగా లేదని భారత విదేశాంగ శాఖ పేర్కొన్నది. గత రాత్రి అరేబియా సముద్రంలో ఈ ఘటన జరిగినట్లు విదేశాంగ శాఖ వర్గాలు వెల్లడించాయి.
న్యూఢిల్లీ: అంతర్జాతీయ సముద్ర జలాల్లో ఇండో, పాక్ నౌకలు ఢీకొన్నాయి(Ship Collision). ఈ ఘటనపై ఇవాళ భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. పాకిస్థాన్ నౌకాదళ వ్యవహారం ఆమోదయోగ్యంగా లేదని, దాని ప్రవర్తన ప్రొఫెషనల్‌గా లేదని భారత్ పేర్కొన్నది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ దౌత్యవేత్తకు భారత్ సమన్లు జారీ చేసింది. భారతీయ నేవీ నౌకను పాక్ నేవీ నౌక ఢీకొన్నట్లు విదేశాంగ వర్గాలు తెలిపాయి. ఈ ఘటన అంతర్జాతీయ జలాల్లో జరిగినా, భారతీయ నౌకకు డ్యామేజ్ జరగలేదని, కానీ పాకిస్థాన్ నౌకాదళ ప్రవర్తన సరిగా లేదని భారత్ పేర్కొన్నది.
1991 నాటి నౌకావిన్యాసాల అగ్రిమెంట్‌లోని ఆర్టికల్ 10 ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు అవుతుందని భారత విదేశాంగ శాఖ ఓ ప్రకనలో తెలిపింది. గత రాత్రి అరేబియా సముద్రంలో ఈ ఘటన జరిగినట్లు విదేశాంగ శాఖ వర్గాలు వెల్లడించాయి. పాకిస్థానీ విదేశాంగ శాఖకు ఈ విషయాన్ని చేరవేసినట్లు భారత్ తెలిపింది. పాక్ మిలిటరీ యూనిట్లు అన్నీ అప్రమత్తంగా వ్యవహరించాలని సూచన చేసినట్లు చెప్పారు. పాకిస్థాన్ విదేశాగ శాఖ ముందు నిరసన వ్యక్తం చేయాలని ఇస్లామాబాద్‌లోని భారత ఎంబసీకి చెప్పినట్లు భారత విదేశాంగ శాఖ పేర్కొన్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

