హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి నిత్యం ఎంతోమంది ప్రయాణికులు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు పుష్పక్ బస్సుల్లో వెళ్తుంటారు. వారి కోసం బస్సు టికెట్ ధరలో 10శాతం డిసౌంట్ ఇవ్వనున్నట్టు టీజీఎస్ఆర్టీసీ ప్రకటించింది.
ముగ్గురు లేదా అంతకన్నా ఎకువ మంది కలిసి గ్రూప్‌గా వెళ్తే.. వారికి అదనంగా మరో 10 శాతం కలిపి మొత్తం 20 శాతం డిసౌంట్ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ ఆఫర్ ఎయిర్‌పోర్టుకు వెళ్లే ప్రయాణికులకు వర్తించనున్నట్టు తెలిపింది.