హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): తెలంగాణ వ్యాప్తంగా వివిధ కేసుల్లో 48 మంది సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేసినట్టు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో వెల్లడించింది. రాష్ట్రంలోని ఆయా ప్రాంతాల్లోని పోలీసులు, టీజీసీఎస్బీ సంయుక్త ఆపరేషన్ ద్వారా వీరిని అదుపులోకి తీసుకున్నామని టీజీసీఎస్బీ డైరెక్టర్ శిఖా గోయల్ బుధవారం ప్రకటించారు.
వీరిపై తెలంగాణ వ్యాప్తంగా 508 కేసులు, దేశవ్యాప్తంగా 2,194 కేసులు నమోదైనట్టు చెప్పారు. మొత్తం రూ.8,16,44,785 కాజేసినట్టు వెల్లడించారు. వ్యాపార పెట్టుబడులు, ఉద్యోగాల పేరిట మోసాలు, డిజిటల్ అరెస్టులు, కొరియర్ స్కామ్‌లకు పాల్పడ్డట్లు పేర్కొన్నారు.
వీరిలో 38మందికి మ్యూల్అకౌంట్లు ఉన్న ట్టు, మిగిలిన 10 మందిని ఏజెంట్లుగా గుర్తించారు. కార్యక్రమంలో ఎస్పీ దేవేందర్‌సింగ్, డీఎస్పీలు సూర్యప్రకాశ్, హరికృష్ణ, ప్రసాద్, ఇన్స్పెక్టర్లు రమేశ్, ఆశిష్‌రెడ్డి, రవికుమార్, శ్రీనివాస్, మహేందర్, లక్ష్మీనారాయణ, ముఖీద్‌పాషా, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.