Group-2 | హైదరాబాద్ : గ్రూప్-2 రిక్రూట్మెంట్ విషయంలో టీజీపీఎస్సీ కీలక అప్డేట్ ఇచ్చింది. ఈ నెల 18వ తేదీన గ్రూప్-2 రాత పరీక్షల ప్రాథమిక కీని విడుదల చేయనున్నట్లు టీజీపీఎస్సీ అధికారులు ప్రకటించారు. ఈ నెల 18 నుంచి 22 వరకు అభ్యర్థుల లాగిన్‌లో ప్రాథమిక కీ అందుబాటులో ఉంటుందన్నారు. అభ్యర్థులు ఆన్లైన్లోనే అభ్యంతరాలను తెలపాలని సూచించారు.
ప్రాథమిక కీ రేపట్నుంచి 22వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అభ్యంతరాలను స్వీకరిస్తామని అధికారులు తెలిపారు. ఇక అభ్యంతరాలను కేవలం ఆంగ్ల భాషలోనే తెలపాలని అధికారులు సూచించారు. అభ్యర్థులు చెప్పదలచుకున్న అభ్యంతరాలకు తప్పనిసరిగా.. ఆ అంశం ఏ పుస్తకంలోనిది..? ఆథర్ ఎవరు..? ఎడిషన్, పేజీ నంబర్, పబ్లిషర్స్ పేరు లేదా వెబ్సైట్ యూఆర్ఎల్ను మెన్షన్ చేయాలని చెప్పారు. ఇక అభ్యంతరాలను ఈ మెయిల్ ద్వారానే పంపాలన్నారు. గతేడాది డిసెంబర్ 15, 16 తేదీల్లో గ్రూప్-2 రాతపరీక్షను నిర్వహించిన సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి..
KTR | రేవంత్ రెడ్డినే అసలు సిసలు ఆర్ఎస్ఎస్ మనిషి : కేటీఆర్
KTR | స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత రైతు భరోసాను ఎత్తేయడం ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
KTR | తెలంగాణలో ఆలీబాబా అరడజన్ దొంగల పాలన.. రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ తీవ్ర విమర్శలు