Group 1 | గ్రూప్ 1 అంశంపై హైకోర్టు డివిజన్ బెంచ్‌ను టీజీపీఎస్సీ ఆశ్రయించింది. గ్రూప్ పరీక్షల్లో జరిగిన అవకతవకల పట్ల సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ డివిజన్ బెంచ్ వద్ద పిటిషన్ దాఖలు చేసింది. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలకు సంబంధించి మార్చి 10న విడుదల చేసిన ఫలితాలను, మార్చి 30న ప్రకటించిన జనరల్ ర్యాంకులను హైకోర్టు సింగిల్ బెంచ్ ఈ నెల 9వ తేదీన సంచలన తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే.
గ్రూప్-1 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ నిర్వహించిన మెయిన్స్ పరీక్షల్లో అవకతవకలు జరిగాయని ఇటీవల తెలంగాణ హైకోర్టు తేల్చింది. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడిలో అక్రమాలు చోటు చేసుకున్నాయని, అవకతవకలు జరిగాయని దాఖలైన పిటిషన్లపై హైకోర్టు మంగళవారం కీలక తీర్పు వెలువరించింది. 563 గ్రూప్-1 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ 2024 ఫిబ్రవరి 19న నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. గతేడాది జూన్ 9న ప్రిలిమ్స్, అక్టోబర్ 21 నుంచి 27 వరకు మెయిన్స్ పరీక్షలను నిర్వహించింది. ఈ ఏడాది మార్చి 30న ఫలితాలను వెల్లడించింది. ఏప్రిల్ 16 నుంచి 21 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు పిలిచింది. కొందరు అభ్యర్థులు మెయిన్స్ పరీక్ష నిర్వహణ, మూల్యాంకనం విధానాలను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు.
గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలను రద్దు చేయాలని, చేయవద్దని కోరుతూ దాఖలైన 12 పిటిషన్లపై న్యాయమూర్తి జస్టిస్ నామవరపు రాజేశ్వర్‌రావు ధర్మాసనం విచారణ జరిపింది. ఇరుపక్షాల వాదప్రతివాదనలు, పత్రాల పరిశీలన, విశ్లేషణ అనంతరం మంగళవారం 222 పేజీల సంచలన తీర్పును వెలువరించింది. విధానపరమైన అంశాలు, మూల్యాంకన పద్ధతి ఆధారంగా విభజించి తీర్పునిచ్చింది. గ్రూప్-1 మెయి న్స్ పరీక్షను కమిషన్ పారదర్శకంగా నిర్వహించలేదని హైకోర్టు తేల్చిచెప్పింది. సమగ్రత కొరవడిందని తప్పుపట్టింది. పక్షపాతంతో వ్యవహరించిందని ఉద్యోగ నియామక నియమాలను టీజీపీఎస్సీ ఉల్లంఘించిందని తేల్చింది. ఉద్యోగం సాధించాలనే నిరుద్యోగ యువత ఆశలపై నీళ్లు చల్లిందని, రోజుకు పదిపన్నెండు గంటలపాటు చదివిన విద్యార్థులకు కమిషన్ నిర్లక్ష్యం, అసమర్థత ఫలితంగా నిరాశ మిగిలిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రతిభావంతులైన తెలంగాణ నిరుద్యోగ యువత కోచింగ్ కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేసుకున్నారని ఆవేదన వ్యక్తంచేసింది.
కొంతమంది అభ్యర్థులు గ్రూప్-1 పోస్టులు సాధించేందుకు ఉన్న ఉద్యోగాలకు రాజీనామా చేసి పరీక్షలకు సిద్ధమయ్యారని, వారికి ఉద్యోగాలు పొందలేని పరిస్థితిని కల్పించిందని టీజీపీఎస్సీపై నిప్పులు చెరిగింది. రాష్ట్ర ప్రభుత్వం, కమిషన్ మూల్యాంకనంలోనే కాకుండా విధానపరమైన అంశాల్లోనూ వైఫల్యం చెందాయని మండిపడింది. రెండుసార్లు గ్రూప్ -1 పరీక్ష రద్దయినా, దాని నుంచి గుణపాఠాలు నేర్చుకోలేదని తీవ్రంగా తప్పుపట్టింది. ఈ కారణాల వల్ల ఈ ఏడాది మార్చి 10న విడుదల చేసిన తుది మారుల జాబితాను, అదే నెల 30న ప్రకటించిన జనరల్ ర్యాంకింగ్ జాబితాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. సంజయ్ సింగ్ వర్సెస్ యూపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేసులో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు మేరకు ‘మాడరేషన్’ పద్ధతిని వర్తింపజేయడం ద్వారా గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల సమాధాన పత్రాలను మాన్యువల్‌గా తిరిగి మూల్యాంకనం చేయాలని టీజీపీఎస్సీని ధర్మాసనం ఆదేశించింది. ఆ తర్వాతే ఫలితాలను ప్రకటించాలని, అనంతరం 563 గ్రూప్-1 పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. పునఃమూల్యాంకనం చేయలేని పక్షంలో గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షను తిరిగి నిర్వహించాలని కీలక ఆదేశాలను వెలువరించింది. గత ఏడాది ఫిబ్రవరి 19న వెలువడిన ఉద్యోగ నోటిఫికేషన్ (నెం.02/ 2024) మేరకు పరీక్షలు జరపాలని స్పష్టం చేసింది. ఈ ప్రక్రియ మొత్తం తీర్పు వెలువడినప్పటి నుంచి ఎనిమిది నెలల్లోగా పూర్తి చేయాలని ఆదేశించింది.
మూల్యాంకనం సరైన విధానంలో జరగలేదని, మాడరేషన్ విధానాన్ని అమలు చేయలేదని హైకోర్టు తప్పుపట్టింది. మూల్యాంకనం చేసిన వాళ్లు ఇంగ్లిష్, తెలుగు మాధ్యమాల్లో నిపుణులేనని, మూల్యాంకన విధానం ఒకేరీతిలో జరిగలేదని పేర్కొన్నది. కమిషన్ రెండు, మూడు రకాల మూల్యాంకనం చేయించిందని తేల్చింది. మాడరేషన్ను అనుసరించలేదని, ఇది అసమానతకు దారి తీస్తుందని, రాజ్యాంగ హకులను ఉల్లంఘించడమే అవుతుందని స్పష్టంచేసింది. ఏకపక్ష మూల్యాంకనం చెల్లదన్నది. ‘కమిషన్ తొలి జాబితాలో సోషియాలజీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్‌కు ప్రత్యేక ప్రొఫెసర్, తెలంగాణ ఉద్యమం అవగాహన ఉన్నవారు, ఆరువిభాగాల జనరల్ వ్యాసాలకు విభాగాలవారీగా ప్యానెల్ లేదు. చాలామంది డిగ్రీ కాలేజీల లెక్చరర్లు, సబ్జెక్టుపై తాజా అవగాహనలేని వాళ్లున్నారు. రిటైర్డ్ అయినవాళ్లున్నారు. ఇది సువాంకర్ కేసులో సుప్రీంకోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకం. మూల్యాంకనానికి అదే సబ్జెక్టు నిపుణుడే ఉండాలి. మూల్యాంకన ప్రక్రియను టీజీపీఎస్సీ అపహాస్యం చేసింది’ అని హైకోర్టు మండిపడింది.
మూల్యాంకంన విషయంలో నోటిఫికేషన్ నిబంధనలకు కమిషన్ నీళ్లు వదిలిందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. మూల్యాంకనం తొలి రెండుసార్లు బార్ కోడ్, బబ్లింగ్ ఆధారంగా చేసినట్టు వెబ్సైట్లో పొందుపర్చిందని గుర్తుచేసింది. ఈ విషయాన్ని నోటిఫికేషన్లో చెప్పలేదన్నది. ఏపీలో కూడా ఇదేవిధానాన్ని అనుసరించిందని టీజీపీఎస్సీ చెప్పుకున్నదని, కానీ ఏపీకి భిన్నంగా మూడో మూల్యాంకనం చేయించిందని పేర్కొన్నది. దీంతో మారులు తారుమారు చేసేందుకు వీలుంటుందని అనుమానం వ్యక్తంచేసింది. పత్రికలకు విడుదల చేసిన ప్రకటనలో మూడో మూల్యాంకనం విధానాన్నే పేరొనలేదని తెలిపింది. మూల్యాంకనానికి ఒక విధానాన్ని అవలంబించలేదని తప్పుబట్టింది.‘ఇంగ్లిష్‌లో కనీస అర్హత ఓసీలకు 40, బీసీలకు 35, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 30 శాతం చొప్పున ఉండాలి. ఇవి ర్యాకింగ్కి తీసుకోరు. ఈ రూల్‌ను కమిషన్ అమలుచేస్తే 30 శాతం కంటే తకువ మారులు వచ్చినవారు ఇతర పేపర్ల ఎవాల్యుయేషన్కు అనర్హులు. కమిషన్ సమాచారం ప్రకారం ఇంగ్లిష్‌లో అర్హత సాధించనివారి పత్రాలను మూల్యాంకనం చేసి మారులను వెల్లడించింది. అంటే నోటిఫికేషన్ నిబంధనలకు కమిషన్ నీళ్లు వదిలిందన్న మాట’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. మూల్యాంకనం ఎంత నిజాయితీగా జరిగిందో, పారదర్శకంగా జరిగిందో ఇదే నిరూపిస్తున్నదని ఎద్దేవాచేసింది. ఫెయిల్ అయ్యాక ఎంపికప్రక్రియను సవాల్ చేయడం చెల్లదని, పిటిషన్లు విచారణార్హం కాదన్న కమిషన్ వాదనను తిరసరించింది. అక్రమాలు, అవకతవకలు జరిగినపుడు న్యాయసమీక్ష చేయవచ్చునని పేరొన్నది.
‘నిబంధనల ప్రకారం మూల్యాంకనానికి రెగ్యులర్ సిబ్బందినే వినియోగించాల్సి ఉండగా, రిటైర్డ్ వాళ్లను కమిషన్ వినియోగించింది. ఒకరు ఆర్సీరెడ్డి సెంటరులో పనిచేసినట్లు ఆధారాలున్నా చర్యలు తీసుకోలేదు’ అని హైకోర్టు నిలదీసింది. ‘కమిషన్ ప్రకటన ప్రకారం రెండుసార్లు మూల్యాంకనం చేయాలి. తెలుగు, ఇంగ్లిష్ జవాబు పత్రాలను మూల్యాంకనం చేయడం ద్వారా అభ్యర్థులకు నష్టమన్న వాదనను కమిషన్ కాదంటున్నది. ఇద్దరి మూల్యాంకనంలో 15 శాతం మారులు తేడా ఉం టే మూడోసారి మూల్యాంకనం చేసినట్టు చెప్పింది. దీని కీ లేదని కమిషన్ చెప్పడం విడ్డూరంగా ఉన్నది’ అని ధర్మాసనం అభిప్రాయపడింది.
తెలంగాణ ఉద్యమం గురించి ఒకరు ఒక పేజీలో, మరొకరు 10 పేజీల్లో రాసినట్లయితే ఎలా మా రులు వేస్తారన్న కోర్టు ప్రశ్నకు కమిషన్ జవాబు చెప్పలేదని ఆగ్రహం వక్తం చేసింది. కమిషన్ మాట మీద నిలబడలేదని, ఎప్పటికప్పుడు మాట మార్చిందని మండిపడింది. మాడరేషన్ విధానాన్ని అనుసరించామని చెప్పి, తర్వాత కాదని చెప్పడమే నిదర్శనంగా అభివర్ణించింది. కమిషన్ ఎంచుకున్న మూల్యాంకన ప్రక్రియ దాని ప్రతిష్టను నీరుగార్చిందని ఆవేదన వ్యక్తం చేసింది. ‘ఎంతోమంది కార్పొరేట్ ఉద్యోగాలకు రాజీనామా చేసి గ్రూప్-1 పోస్టులకు పోటీపడితే, వాళ్లకు వచ్చిన మారులు విస్మయానికి గురిచేశాయి. నాలుగు సబ్జెక్టుల్లో కేవలం సింగిల్‌డిజిట్ మారులే వచ్చాయి. తెలంగాణ ఉద్యమం గురించి రాస్తే 7 మారులే వచ్చాయి. కొన్ని సెంటర్లలో ఒకరు కూడా అర్హత సాధించలేదు. కమిషన్ సీల్డ్కవర్లో ఇచ్చిన వివరాలు పరిశీలిస్తే మూల్యాంకనం కోసం ఒక విధానమే అనుసరించలేదని తేలింది. ప్రశ్నలు ఇంగ్లిష్, తెలుగులోనే ఉన్నాయి.
ఉర్దూలో లేవు. కొన్ని సమాధానాలకు వివరణ లేదు. రెండు కేంద్రాల్లో పరీక్షలు రాసిన పలువురికి ఒకేరకమైన మారులు వచ్చాయి. 719 మందికి ఒకేలా, 440 మందికి ఒకేవిధంగా మారులు వచ్చాయి. దీనిని కమిషన్ సమర్థించుకోవడం ఆమోదయోగ్యంగా లేదు’ అని అభిప్రాయపడింది. కోఠి ఉమెన్స్ కాలేజీ సెంటర్ లో అభ్యర్థులు ఎకువ మంది ఎంపికయ్యారన్నది పిటిషనర్ల అభియోగం అని గుర్తుచేసింది. ‘మహిళా అభ్యర్థులను 28 కేంద్రాల్లో కేటాయించగా, కోఠి ఉమెన్స్ కాలేజీలోని రెండు సెంటర్లలో 71 మంది ఎంపికయ్యారు. ఇది ఎలా సాధ్యం. మిగిలిన 26 పరీక్షా కేంద్రాలో 139 మందే ఎంపికయ్యారు. ఈ కేం ద్రాల్లో మహిళలు ప్రతిభావంతులు కాదా? పేపర్-6లో అత్యధిక మారులు వంద ఎవరికీ రాలేదు. రీ కౌంటింగ్ అప్లికేషన్ చేసుకున్న వాళ్ల మారులు మారాయి. ఇవి సందేహాలకు తావిస్తున్నది’ అని పేర్కొన్నది.
12,381మంది అభ్యర్థులు ఇంగ్లీషులో రాస్తే 506 మంది ఎంపికయ్యారని, తెలుగులో 8,694 మంది హాజరైతే కేవలం 56 మందే ఎంపికయ్యారని, ఉర్దూలో 10 మందికి ఒకరు ఎంపికయ్యారని ధర్మాసనం గుర్తుచేసింది. తెలుగులో రాస్తే మూ ల్యాంకనం సరిగ్గా జరగలేదని, డిగ్రీ కాలేజీ లెక్చరర్లు ఇంగ్లిష్, తెలుగు మాధ్యమాల్లో బోధన చేస్తారని, వాళ్లే మూల్యాంకనం చేశారని కమిషన్ చెప్పిందన్నది. ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూలో నిపుణులే మూ ల్యాంకనం చేయాలని ధర్మాసనం స్పష్టం చేసింది. ఏపీపీఎస్సీలో తెలుగు అభ్యర్థులు ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూల్లో మూడు దశల్లో వడపోశారని, కానీ ఇకడ అలా జరగలేదని స్పష్టం చేసింది. మొత్తంగా తెలుగులో రాసిన వాళ్లకు తీరని అన్యాయం జరిగినట్లు అనిపిస్తున్నదని ధర్మాసనం తీర్పులో వెల్లడించింది.