Job Notifications | మూడు నోటిఫికేషన్లు.. 290 పోస్టులే.. వివిధ విభాగాల్లో ఇంజినీర్ పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ ప్రకటన
Job Notifications | తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) మంగళవారం మూడు ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేసింది. మూడు విభాగాల్లో ఇంజినీరింగ్ పోస్టుల భర్తీకి వేర్వేరు నోటిఫికేషన్లు ఇచ్చింది. ఆ మూడు నోటిఫికేషన్లతో 290 పోస్టులను భర్తీ చేయనున్నట్టు టీజీపీఎస్సీ కార్యదర్శి ఎం హరిత ఒక ప్రకటనలో తెలిపారు.
Job Notifications | హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) మంగళవారం మూడు ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేసింది. మూడు విభాగాల్లో ఇంజినీరింగ్ పోస్టుల భర్తీకి వేర్వేరు నోటిఫికేషన్లు ఇచ్చింది. ఆ మూడు నోటిఫికేషన్లతో 290 పోస్టులను భర్తీ చేయనున్నట్టు టీజీపీఎస్సీ కార్యదర్శి ఎం హరిత ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్అండ్బీ శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్) పోస్టులు 222, అదే శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్) పోస్టులు 49, తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ)లో అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ పోస్టులు 19 చొప్పున ఉన్నాయి.
18-44 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వారు ఈ పోస్టులకు పోటీపడవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వారికి ఐదేండ్లు, వికలాంగులకు పదేండ్ల వయో పరిమితి సడలింపులు వర్తిస్తాయి. వేతన స్కేల్ రూ.54,220 నుంచి రూ.1,33,630గా ఉంటుంది. జనరల్ స్టడీస్, సంబంధిత సబ్జెక్టుల రెండు పేపర్లకు పరీక్షలు నిర్వహిస్తారు. జనరల్ స్టడీస్ పేపర్‌కు 150, సంబంధిత సబ్జెక్టు పేపర్‌కు 300 మార్కుల చొప్పున మొత్తం 450 మార్కులకు పరీక్షలు ఉంటాయి.
- ఆర్అండ్బీ శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్) పోస్టులకు ఈ నెల 8 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుంది. జూలై 15 వరకు దరఖాస్తులకు అవకాశం ఉన్నది. అక్టోబర్‌లో పరీక్షలుంటాయి.
- ఆర్అండ్బీ శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(సివిల్) పోస్టులకు ఈ నెల 6నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. జూలై 13 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అక్టోబర్‌లో పరీక్షలు నిర్వహిస్తారు.
- పీసీబీలోని పోస్టుల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 10 నుంచి ప్రారంభం. జూలై 17 వరకు దరఖాస్తులు. సెప్టెంబర్‌లో పరీక్షలు నిర్వహిస్తారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

