TG TET 2024-II | హైదరాబాద్ : ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ గురువారం రాత్రి నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. శుక్రవారం సాయంత్రం వరకు 775 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. తొలి రోజు పేపర్ -1కు 214, పేపర్ -2కు 431, రెండు పేపర్లకు 130చొప్పున మొత్తంగా 775 దరఖాస్తులొచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు.
ఈ ఏడాది మేలో నిర్వహించిన టెట్‌కు హాజరై, అర్హత సాధించని వారికి ఉచితంగా దరఖాస్తు చేసుకునేందు వెసులుబాటును కల్పించింది. అభ్యర్థులు ఈ నెల 20లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. డిసెంబర్ 26 నుంచి హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకునే అవకాశముండగా, 2025 జనవరి 1 నుంచి 20 వరకు టెట్ పరీక్ష లను ఆన్లైన్లో నిర్వహిస్తారు. ఫిబ్రవరి 5న టెట్ ఫలితాలను విడుదల చేస్తారు.
ఇవి కూడా చదవండి..
Harish Rao | కేసీఆర్ కాలి గోటికి కూడా సరిపోవు రేవంత్ రెడ్డి..! సీఎంపై హరీశ్‌రావు ధ్వజం
500 Fake Notes | స్టాంప్ పేపర్‌పై రూ.500 నోట్లు ముద్రించారు.. తర్వాత ఏం జరిగిందంటే?
SSC Exam Fee | పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లింపు షెడ్యూల్ విడుదల
Telangana | ఎమ్మెల్యేల అనర్హత కేసు.. తదుపరి విచారణ 11కు వాయిదా