Mahesh Bigala | ఎన్నారైల తరపున కేసీఆర్కు గ్లోబల్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల జన్మదిన శుభాకాంక్షలు
Mahesh Bigala | కేసీఆర్ జన్మదినం కేవలం వేడుకలకే పరిమితం కాకుండా, ప్రపంచవ్యాప్తంగా సేవా, చారిటీ కార్యక్రమాలతో స్ఫూర్తిదాయకంగా నిలిచింది. మహేష్ బిగాల ప్రత్యక్షంగా వెళ్లి అందరి ఎన్నారైల తరఫున కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అలాగే 50 దేశాల ఎన్నారైలు పంపిన శుభాకాంక్షలను కేసీఆర్కు అందజేయడం జరిగిందని తెలిపారు.
Mahesh Bigala | బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమ సారధి, స్వరాష్ట్ర సాధకుడు, భారత రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) జన్మదిన వేడుకలు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా నిర్వహించబడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా 50 దేశాల్లో నిర్వహించిన కార్యక్రమాల వీడియోను హైదరాబాద్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (కల్వకుంట్ల తారక రామారావు) విడుదల చేశారు.
అమెరికా నుండి ఆఫ్రికా వరకు, యూరప్, ఆస్ట్రేలియా నుండి గల్ఫ్ దేశాల వరకు ఉన్న ఎన్నారైలు వివిధ సేవా కార్యక్రమాలు, సామాజిక కార్యకలాపాలు, రక్తదాన శిబిరాల ద్వారా ఈ వేడుకలను మరింత ప్రత్యేకంగా మార్చారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రతి ఎన్నారై.. కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, తెలంగాణ రాష్ట్రం ఆయన మార్గదర్శకత్వంలో మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా మహేష్ బిగాల ప్రత్యక్షంగా వెళ్లి అందరి ఎన్నారైల తరఫున కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అలాగే 50 దేశాల ఎన్నారైలు పంపిన శుభాకాంక్షలను కేసీఆర్కు అందజేయడం జరిగిందని తెలిపారు. ఈ విధంగా కేసీఆర్ జన్మదినం కేవలం వేడుకలకే పరిమితం కాకుండా, ప్రపంచవ్యాప్తంగా సేవా, చారిటీ కార్యక్రమాలతో స్ఫూర్తిదాయకంగా నిలిచింది.
ఈ సందర్భంగా హైదరాబాద్లో కేటీఆర్ను కలిసిన వారిలో బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాలతోపాటు మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ యూఎస్ఏ అడ్వైజరీ బోర్డు చైర్మన్ మహేష్ తన్నీరు ఉన్నారు.
Read Also :
KU |తెలంగాణ అస్థిత్వ శిఖరం కేసీఆర్.. కేయూలో బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో కేసీఆర్ జన్మదిన వేడుకలు
Veenavanka | వీణవంకలో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు
Errabelli Dayakar Rao | పోలీసుల ఓవరాక్షన్.. కన్నీళ్లు పెట్టుకున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి : వీడియో
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
Sai Durga Tej | పుట్టినరోజున సాయిదుర్గా తేజ్ కొత్త సినిమా ప్రకటన.. ‘సేవ్ ది టైగర్స్’ దర్శకుడితో మెగా హీరో!
Flowers sale | రైతుకు కాసులు వర్షం కురిపిస్తున్న పూల పండుగ..!
Actor Imran Khan | బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్కు ‘లీవ్ ఇండియా’ నోటీసులు.. అక్టోబర్ 28లోపు దేశం విడిచి వెళ్లాలని ఆదేశం!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

