Pratika Rawal : వరల్డ్‌కప్ విజేతగా విదేశీ పర్యటనలో జోరు కొనసాగిస్తున్న భారత మహిళల జట్టుకు గుడ్‌న్యూస్. వన్డే ప్రపంచకప్‌లో అనూహ్యంగా గాయపడి.. మూడు నెలలకు పైగా ఆటకు దూరమైన ఓపెనర్ ప్రతీకా రావల్ (Pratika Rawal) పునరామనం చేయనుంది. ఈమధ్యే ఫిట్నెస్ సాధించిన ప్రతీకకు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాంతో, సెలెక్టర్లు ఆమెను ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు ఎంపిక చేశారు. టీ20 సిరీస్ ముగిసే లోపే తను టీమిండియా స్క్వాడ్‌లో చేరనుంది.
నిలకడైన ఆటతో ఏడాదిలోనే ఓపెనర్‌గా స్థిరపడిన ప్రతీకా రావల్ పునరాగమనం చేయనుంది. వన్డే వరల్డ్‌కప్‌లో లీగ్ దశ చివరి మ్యాచ్‌లో గాయపడి.. టోర్నీ నుంచి వైదొలిగిన ప్రతీకా.. ఇటీవలే కోలుకుంది. పాదం గాయం తగ్గిపోవడంతో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో రిహాబిలిటేషన్‌లో ఆమె ఫిట్నెస్ సాధించింది.
World Cup Super Star Return back to the Indian ODI Squad for the Australia Tour
Pratika Rawal is back in Indian colors after suffering an injury in the Women’s ODI World Cup 2025#INDWvsAUSW #INDvAUS #PratikaRawal #TeamIndia #cricket 🏏 #ODICricket #WomensCricket #INDWvAUSW pic.twitter.com/UhNFZNEE2N
— Cricket Guru (@CricketGuru_CG) February 17, 2026
దాంతో.. మూడు నెలలకు పైగా జట్టుకు దూరమైన ప్రతీకను సెలెక్టర్లు వన్డే స్క్వాడ్‌లోకి తీసుకున్నారు. దాంతో.. ఈ డాషింగ్ ఓపెనర్ కంగారూ నేలపై తన స్టయిల్లో చెలరేగేందుకు సిద్ధమవుతోంది. టెస్టు స్క్వాడ్‌లోనూ ఉన్న ప్రతీక.. మార్చి 6 న మొదలయ్యే పెర్తు టెస్టులో ఆడనుంది.
భారత జట్టు అప్డేటెడ్ వన్డే స్క్వాడ్ : హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), స్మృతి మంధాన(వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, హర్లీన్ డియోల్, ప్రతీకా రావల్, దీప్తి శర్మ, రీచా ఘోష్(వికెట్ కీపర్), ఉమా ఛెత్రీ(వికెట్ కీపర్), కష్వీ గౌతమ్, అమన్‌జోత్ కౌర్, రేణుకా సింగ్, శ్రీ చరణి, వైష్ణవీ వర్మ, క్రాంతి గౌడ్, స్నేహ్ రానా.