T20 World Cup : ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్‌లో సూపర్ 8పై ఆశలు పెట్టుకున్న ఆస్ట్రేలియా(Australia)కు వరుణుడు బిగ్ షాకిచ్చాడు. పల్లెకెలె స్టేడియంలో కుండపోత కారణంగా ఐర్లాండ్ – జింబాబ్వే మ్యాచ్ రద్దయ్యింది. ఈ మ్యాచ్ వర్షార్పణం కావడంతో.. మాజీ ఛాంపియన్ ఆసీస్ అనూహ్యంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. రెండు మ్యాచ్లులోనూ నెగ్గి.. మ్యాచ్ రద్దుతో ఒక పాయింట్.. మొత్తంగా ఐదు పాయింట్లతో గ్రూప్ బీ నుంచి జింబాబ్వే జట్టు సూపర్ 8కు దూసుకెళ్లింది.
ఐసీసీ ఈవెంట్లలో చెలరేగిపోయే ఆస్ట్రేలియా ఈసారి నాకౌట్‌కు ముందే ఇంటిదారి పట్టింది. పేస్ దళంలో అనుభవజ్ఞులైన ప్యాట్ కమిన్స్, జోష్ హేజిల్‌వుడ్ లేకపోవడం.. టాపార్డర్ వైఫల్యం, నిలకడలేమి.. ఆ జట్టు పాలిట శాపంగా మారాయి. జింబాబ్వే చేతిలో 23 పరుగుల తేడాతో.. శ్రీలంకపై 8 వికెట్ల తేడాతో ఓడడం మిచెల్ మార్ష్ నేతృత్వంలోని కంగారూ జట్టు నాకౌట్ అవకాశాల్ని సంక్లిష్టం మార్చాయి. మంగళవారం కొలంబోలోని పల్లెకెల్ స్టేడియంలో ఐర్లాండ్ చేతిలో జింబాబ్వే ఓడితే ఆసీస్‌కు అవకాశం ఉండేది. కానీ.. వర్షం కారణంగా ఐర్లాండ్ – జింబాబ్వే మ్యాచ్ రద్దయ్యింది.
❌ Did not quality in 2024
✅ Into the Super Eights in 2026 pic.twitter.com/li3CBodBW3— ESPNcricinfo (@ESPNcricinfo) February 17, 2026
వర్షం ఎంతకూ తగ్గకపోవడంతో టాస్ వేయకుండానే ఆటను రద్దు చేసి ఇరుజట్లకు చెరొక పాయింట్ కేటాయించారు. దాంతో.. 5 పాయింట్లతో ఆఫ్రికా జట్టు ముందంజ వేయగా.. మూడింటా ఒకేఒక మ్యాచ్ గెలిచిన ఆసీస్, ఐర్లాండ్ టోర్నీ నుంచి వైదొలిగాయి. చివరి మ్యాచ్‌లో ఒమన్‌పై ఆస్ట్రేలియా గెలుపొందినా 4 పాయింట్లతో మూడో స్థానంలో నిలుస్తుంది. కాబట్టి.. జింబాబ్వే నాకౌట్ దశకు అర్హత సాధించింది. గత సీజన్లో ఒమన్ చేతిలో ఓడి ప్రపంచకప్ ఆడే అవకాశం చేజార్చుకున్న ఆఫ్రికా టీమ్ ఈసారి సికిందర్ రజా నాయకత్వంలో సంచలన ప్రదర్శనతో సూపర్ 8లో అడుగుపెట్టడం విశేషం.
The washout in Pallekele means disaster for two teams… pic.twitter.com/fjFVMMG8Gv
— ESPNcricinfo (@ESPNcricinfo) February 17, 2026