TG Rains | తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా వరదలు పోటెత్తాయి. చెరువులు జలకళను సంతరించుకోగా.. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాలకు సంభవించిన వరదలతో ఖమ్మం సహా పలుచోట్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తాజాగా వర్షాలపై వాతావరణశాఖ మరో కీలక అప్డేట్ను అందించింది. రాబోయే ఐదురోజుల పాటు పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. యానం, ఉత్తరాంధ్ర పరిసరాల్లో కొనసాగుతున్న అల్పపీడనం సముద్రమట్టానికి సగటున 3.1 నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉందని.. ఎత్తుకువెళ్లే కొలది నైరుతి దిశలో వంగి ఉందని పేర్కొంది. గురువారం వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ క్రమంలో రాగల ఐదురోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని.. ఈ క్రమంలో పలు జిల్లాలకు ఆరెంజ్, మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.
బుధవారం కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్,ఆ్త్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. గురువారం భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అతిభారీ వర్షాలు.. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలుతో కూడిన వర్షాలు పడుతాయని చెప్పింది. గడిచిన 24గంటల్లో నిజామాబాద్, మంచిర్యాల, సిద్దిపేట, కొత్తగూడెం జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా సిద్దిపేట జిల్లాలో కొహెడలో 22.3, సముద్రాల గ్రామంలో 21 సెంటీమీటర్ల భారీ వర్షాపాతం రికార్డయ్యిందని టీజీడీపీఎస్ వివరించింది.
Four Indians Dies | అమెరికా రోడ్డు ప్రమాదంలో నలుగురు భారతీయులు మృతి.. మృతుల్లో ముగ్గురు తెలంగాణ వారు
Bhadrachalam | భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం..మొదటి ప్రమాద హెచ్చరిక జారీ