TG EdCET | హైదరాబాద్ : రెండేండ్ల బీఈడీ కోర్సులో మరో 6,928 సీట్లు భర్తీ అయ్యాయి. రెండో విడుత వెబ్ కౌన్సెలింగ్‌లో ఆయా సీట్లు నిండాయి. రెండో విడుత కౌన్సెలింగ్‌కు 11,087 మంది హాజరుకాగా, 9,616 సీట్లకు గానూ 6,928 సీట్లు నిండాయి. మొదటి విడుత కౌన్సెలింగ్‌లో 9,817 మంది సీట్లు కేటాయించగా, వీరిలో 4,841 మంది రిపోర్ట్ చేశారు. రెండో విడుతలో సీట్లు పొందిన వారు ఈ నెల 30వ తేదీలోపు ఆయా కాలేజీల్లో రిపోర్ట్ చేయాలని ఎడ్‌సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ రమేష్‌బాబు సూచించారు.
ఇవి కూడా చదవండి..
Ponguleti Srinivas Reddy | మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసంలో కొనసాగుతున్న ఈడీ సోదాలు
HYDRAA | హైడ్రాపై హైకోర్టు సీరియస్.. విచారణకు హాజరు కావాలని రంగనాథ్‌కు ఆదేశం