TG EdCET | హైదరాబాద్ : టీజీ ఎడ్‌సెట్, టీజీ పీఈసెట్ కౌన్సెలింగ్‌కు సంబంధించి ఉన్నత విద్యామండలి షెడ్యూల్ విడుదల చేసింది. టీజీ ఎడ్‌సెట్ ద్వారా బీఈడీ కాలేజీల్లో, పీఈసెట్ ద్వారా ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. ఎడ్‌సెట్, పీఈసెట్ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ నెల 31 నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది.
అర్హులైన అభ్యర్థులు సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిమిత్తం ఆగస్టు 8వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ తేదీల్లోనే అభ్యర్థుల సర్టిఫికెట్లను వెరిఫికేషన్ చేయనున్నారు. 12 నుంచి 16వ తేదీ మధ్యలో ఎన్సీసీ, సీఏపీ, పీహెచ్, స్పోర్ట్స్ అభ్యర్థుల సర్టిఫికెట్లను వెరిఫికేషన్ చేయనున్నారు. 21న అర్హత గల అభ్యర్థుల జాబితాను విడుదల చేయనున్నారు. 22 నుంచి 23వ తేదీ వరకు అర్హులు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు. 24న వెబ్ ఆప్షన్స్‌ను ఎడిట్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. 30వ తేదీన ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు జాబితా విడుదల చేయనున్నారు. సీట్లు పొందిన అభ్యర్థులు 31 నుంచి సెప్టెంబర్ 4వ తేదీ వరకు ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఆయా కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఆగస్టు 31 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి.
అర్హులైన అభ్యర్థులు సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిమిత్తం ఆగస్టు 7వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ తేదీల్లోనే అభ్యర్థుల సర్టిఫికెట్లను వెరిఫికేషన్ చేయనున్నారు. 13 నుంచి 14వ తేదీ మధ్యలో ఎన్సీసీ, సీఏపీ, పీహెచ్, స్పోర్ట్స్ అభ్యర్థుల సర్టిఫికెట్లను వెరిఫికేషన్ చేయనున్నారు. 14న అర్హత గల అభ్యర్థుల జాబితాను విడుదల చేయనున్నారు. 16 నుంచి 17వ తేదీ వరకు అర్హులు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు. 18న వెబ్ ఆప్షన్స్‌ను ఎడిట్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. 20వ తేదీన ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు జాబితా విడుదల చేయనున్నారు. సీట్లు పొందిన అభ్యర్థులు 21 నుంచి 24వ తేదీ వరకు ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఆయా కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఆగస్టు 27 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి.
ఇవి కూడా చదవండి..
Harish Rao | బీర్లు, లిక్కర్ ధరలు భారీగా పెంచబోతున్నారు..! : హరీశ్‌రావు
Harish Rao | అధ్యక్షా ఆయనకు హాఫ్ నాలెడ్జ్.. మంత్రి కోమటిరెడ్డిపై హరీశ్ రావు ఫైర్
Harish Rao | బీఆర్ఎస్ పదేండ్ల శ్రమను.. కాంగ్రెస్ 8 నెలల డ్రామాలను ప్రజలు చూస్తున్నారు: హరీశ్ రావు
Jagadish Reddy | వ్యవసాయంపై ఒక్క మంత్రికీ అవగాహన లేదు: మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి