TG CPGET 2024 | హైదరాబాద్ : రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల పరిధిలోని పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రెన్స్ టెస్ట్ (సీపీగెట్) – 2024 ఫలితాలు శుక్రవారం విడుదల కానున్నాయి. ఈ ఫలితాలను ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పీ లక్ష్మీనారాయణ కలిసి శుక్రవారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నారు. సీపీగెట్ ఫలితాలను ఉస్మానియా యూనివర్సిటీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నారు.
2024-25 విద్యా సంవత్సరానికి గానూ ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ, శాతవాహన, తెలంగాణ మహిళా యూనివర్సిటీతో పాటు జవహర్లాల్ నెహ్రూ టెక్నాలాజికల్ యూనివర్సిటీల్లో పీజీ కోర్సులు ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంకామ్, ఎంఎల్ఐసీ, ఎంఈడీ, ఎంపీఈడీతో పాటు పలు కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. ఈ ప్రవేశాలకు సంబంధించిన రాతపరీక్షలను కంప్యూటర్ బేస్డ్ విధానంలో జులై 6 నుంచి 16వ తేదీ వరకు నిర్వహించారు. రోజుకు మూడు షిఫ్టుల్లో మొత్తం 41 పీజీ కోర్సులు, నాలుగు ఐదేండ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులకు రాతపరీక్షలు నిర్వహించారు. ఈ 45 కోర్సులకు 73,342 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 64,765 మంది పరీక్షలకు హాజరయ్యారు.
ఇవి కూడా చదవండి..
TG PGECET | టీజీ పీజీఈసెట్ – 2024 ప్రవేశాలకు రీషెడ్యూల్ విడుదల
TG Weather | ఈ జిల్లాల్లో రెండురోజులు వానలు.. హెచ్చరించిన ఐఎండీ హైదరాబాద్
Silver- Gold Rates | భారీగా తగ్గిన వెండి ధర.. ఫ్లాట్గా బంగారం.. కారణమిదేనా..?!