TG PGECET | హైదరాబాద్ : టీజీ పీజీఈసెట్ -2024 ప్రవేశాలకు సంబంధించి అధికారులు రీషెడ్యూల్ విడుదల చేశారు. ఫార్మసీ కాలేజీలకు ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనుమతులు ఇవ్వడంలో ఆలస్యం కారణంగా.. ఫేజ్-1 కౌన్సెలింగ్ ప్రక్రియను రీషెడ్యూల్ చేస్తున్నట్లు కన్వీనర్ పేర్కొన్నారు.
టీజీ పీజీఈసెట్లో అర్హత సాధించిన అభ్యర్థులు.. ఈ నెల 24వ తేదీ లోపు రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. సర్టిఫికెట్లను కూడా అప్లోడ్ చేయాలని సూచించారు. దీంతో సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి కానుంది. సర్టిఫికెట్ వెరిఫికేషన్ అనంతరం ఎలిజిబుల్ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ అభ్యర్థుల జాబితాను ఆగస్టు 25న విడుదల చేయనున్నారు. 27, 28 తేదీల్లో వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. 29న వెబ్ ఆప్షన్లను ఎడిట్ చేసుకునే అవకాశం కల్పించారు. సెప్టెంబర్ 1వ తేదీన సీట్ల కేటాయింపు జరగనుంది. సీట్లు పొందిన అభ్యర్థులు సెప్టెంబర్ 2 నుంచి 5వ తేదీ మధ్యలో ఒరిజినల్ సర్టిఫికెట్లతో కాలేజీల్లో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 2 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి.
ఇవి కూడా చదవండి..
TG Weather | ఈ జిల్లాల్లో రెండురోజులు వానలు.. హెచ్చరించిన ఐఎండీ హైదరాబాద్
Telangana | నీటి పారుదల శాఖలో 38 మంది విశ్రాంత ఉద్యోగుల కొనసాగింపు..