హైదరాబాద్ : రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) నిర్వహణకు నోటిఫికేషన్ జారీ అయ్యింది. ఈ నెల 26 నుంచి ఏప్రిల్ 12వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనుండగా.. జూన్ 12న టెట్ నిర్వహించనున్నట్లు విద్యాశాఖ పేర్కొంది. ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో 80,039 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు, అధికారులు సమీక్షించి వీలైనంత ఉద్యోగాలకు అనుమతులు ఇవ్వాలని సీఎం శాసన సభలో ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు మంత్రి హరీశ్‌రావు ఆయా శాఖల అధికారులతో పలు దఫాలుగా చర్చించారు.
మొత్తం 80,039 పోస్టులకు తొలి విడుత 30,453 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ బుధవారం అనుమతులు జారీ చేసింది. ఈ మేరకు శాఖల వారీగా ఉద్యోగ నియామకాలకు అనుమతిస్తూ జీవోలు విడుదలయ్యాయి. గ్రూప్-1, హోంశాఖ, జైళ్లు, రవాణాశాఖలు, వైద్య, ఆరోగ్యశాల్లోని పోస్టులతో పాటు, ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహణకు సైతం ఆర్థిక శాఖ ఆదేశాలు ఇచ్చింది. ఈ
క్రమంలోనే విద్యాశాఖ టెట్ నిర్వహణ కోసం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.